Pawan Kalyan | త్రివిక్రమ్‌కు పవన్ కల్యాణ్ స్పెషల్ ప్యాకేజీ..?
పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) సినిమాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏదో ఒక రకంగా త్రివిక్రమ్ (Trivikram) హ్యాండ్ ఉండాల్సిందే. అంటే ఈ ఇద్దరి మధ్య ఉండే బాండింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటారు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan), త్రివిక్రమ్ (Trivikram). పవన్ కల్యాణ్ సినిమాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏదో ఒక రకంగా త్రివిక్రమ్ హ్యాండ్ ఉండాల్సిందే. అంటే ఈ ఇద్దరి మధ్య ఉండే బాండింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రొఫెషనల్‌గానే కాకుండా వ్యక్తిగతంగా కూడా త్రివిక్రమ్-పవన్ ఒకరిపై ఒకరికి చాలా నమ్మకం. ఇటీవలే వచ్చి మంచి హిట్టు కొట్టిన భీమ్లానాయక్..కర్త, కర్మ, క్రియ త్రివిక్రమ్ అని ప్రతీ ఒక్కరికీ తెలిసిందే.
సాగర్ కే చంద్ర (Sagar k Chandra) డైరెక్ట్ చేసినప్పటికీ..త్రివిక్రమ్ పర్యవేక్షణలోనే కాస్టింగ్, క్రియేటివ్ రైటింగ్, ప్రమోషనల్ ప్లాన్స్ జరిగాయి. తాజాగా ఓ క్రేజీ గాసిప్ ఒకటి ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. తన సినిమాల జర్నీలో భాగమవుతున్న త్రివిక్రమ్‌కు స్పెషల్ ప్యాకేజీ ఇస్తే బాగుంటుందని తన నిర్మాతలను అదిగాడట పవన్ కల్యాణ్. ఒకవేళ ప్యాకేజీలాంటి దేమి లేకున్నా పవన్‌కు ఓ స్నేహితుడిగా సాయం చేసేందుకు త్రివిక్రమ్ ఎప్పుడూ రెడీగానే ఉంటాడనేది అందరికీ తెలిసిందే.
Read Also : Sunny Leone | మంచు విష్ణును భయపెట్టిన సన్నీలియోన్..వీడియో హల్చల్
మరోవైపు ఏ నిర్మాత కూడా అలాంటి ప్యాకేజీ ఏం ఇవ్వలేదని ఇటు పవన్, అటు త్రివిక్రమ్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే భీమ్లానాయక్ సినిమా నిర్మించింది తనకు హోం ప్రొడక్షన్స్ లాంటి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కావడంతో త్రివిక్రమ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. దీంతో సంబంధం లేకుండా పవన్ కల్యాణ్ సినిమాలంటే ఎప్పుడూ శ్రద్ద తీసుకుంటాడు త్రివిక్రమ్. పవన్ కల్యాణ్ నెక్ట్స్ చేయబోతున్న వినోధయ్ సీతమ్ రీమేక్ విషయంలో త్రివిక్రమ్ కొన్ని ఇన్ పుట్స్ అందించబోతున్నాడని తెలుస్తోంది.
Read Also : Pawan kalyan Martial Arts | మార్షల్ ఆర్ట్స్ సెషన్లో ‘హరిహర వీరమల్లు’..స్టైల్ అదిరింది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

