Stree 2 Movie | బాలీవుడ్ నటులు రాజ్ కుమార్ రావు, శ్రద్దా కపూర్, పంకజ్ త్రిపాఠీ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘స్త్రీ 2’. బ్లాక్ బస్టర్ మూవీ ‘స్త్రీ’ (Stree) సీక్వెల్గా ఈ చిత్రం వచ్చింది. ఐదేళ్ల కిందట బాలీవుడ్లో వచ్చిన ‘స్త్రీ’ (Stree) చిత్రం సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. కేవలం పదిహేను కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రూ.180 కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టింది. కామెడీ హార్రర్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా హిందీ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ రావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇండిపెండెన్స్ కానుకగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే అరుదైన రికార్డును అందుకుంది.
ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాల వలన మేకర్స్ అభిమానుల కోసం పెయిడ్ ప్రీమియర్స్ షోలను ఏర్పాటు చేశారు. అయితే ఈ పెయిడ్ ప్రీమియర్స్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా 2013 నుంచి సుమారు 11 ఏళ్ల పాటు షారుఖ్ ఖాన్ పేరిటా ఉన్న రికార్డును బద్దలుకొట్టింది. కేవలం పెయిడ్ ప్రీమియర్స్తో రూ.10 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో దేశంలోనే మొదటిసారి అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన పెయిడ్ ప్రీమియర్స్ చిత్రంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు షారుఖ్ చెన్నై ఎక్స్ప్రెస్ (రూ. 8 కోట్లు) సినిమాపై ఉంది.