Toxic | ‘టాక్సిక్’కు రెండో రోజు భారీ షాక్.. పాన్ ఇండియా సినిమాకు గట్టి పోటీ ఇస్తున్న ‘ఇరుముడి’!
Toxic | కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ విడుదలకు ముందు నుంచే ఊహించని హైప్‌ను సొంతం చేసుకుంది. భారీ అంచనాలు, యశ్ క్రేజ్, భారీ స్థాయిలో రిలీజ్ కారణంగా తొలి రోజు బుకింగ్స్‌లో ఈ సినిమా ఊహించని రికార్డులు నమోదు చేసింది.
Toxic | కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ విడుదలకు ముందు నుంచే ఊహించని హైప్‌ను సొంతం చేసుకుంది. భారీ అంచనాలు, యశ్ క్రేజ్, భారీ స్థాయిలో రిలీజ్ కారణంగా తొలి రోజు బుకింగ్స్‌లో ఈ సినిమా ఊహించని రికార్డులు నమోదు చేసింది. అయితే సినిమా విడుదలైన తర్వాత వచ్చిన మిశ్రమ స్పందన రెండో రోజు బుకింగ్స్‌పై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. మొదటి రోజు భారీ టికెట్ సేల్స్‌తో దూసుకెళ్లిన ‘టాక్సిక్’ రెండో రోజు మాత్రం గణనీయమైన డ్రాప్‌ను ఎదుర్కొంది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు టికెట్ సేల్స్‌లో దాదాపు 60 శాతం వరకు తగ్గుదల నమోదైనట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండో రోజు ఈ చిత్రం సుమారు 3.70 లక్షలకు పైగా టికెట్లు మాత్రమే విక్రయించినట్లు సమాచారం.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ‘టాక్సిక్’లాంటి భారీ పాన్ ఇండియా సినిమా రెండో రోజు బుకింగ్స్ తగ్గిన సమయంలో, తెలుగు ప్రాంతీయ చిత్రం ‘ఇరుముడి’ మాత్రం బలమైన ప్రదర్శన కనబరుస్తోందనే చర్చ జరుగుతోంది. తక్కువ స్క్రీన్స్‌లో ప్రదర్శితమవుతున్నప్పటికీ ‘ఇరుముడి’కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ కొనసాగుతోంది. వర్కింగ్ డే అయినప్పటికీ ‘ఇరుముడి’ బుకింగ్స్ గట్టిగానే కొనసాగడం ట్రేడ్ వర్గాలను ఆకర్షిస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రెండో రోజు ఈ సినిమాకు 5 లక్షలకు పైగా టికెట్ సేల్స్ నమోదైనట్లు ప్రచారం జరుగుతోంది. భారీ స్క్రీన్ కౌంట్, పాన్ ఇండియా రిలీజ్ ఉన్న ‘టాక్సిక్’తో పోలిస్తే పరిమిత స్థాయిలో విడుదలైన ‘ఇరుముడి’ ఈ స్థాయి బుకింగ్స్ సాధించడం విశేషంగా మారింది.
మొదటి రోజు భారీ ఓపెనింగ్ సాధించినప్పటికీ ‘టాక్సిక్’ అసలు బాక్సాఫీస్ పరీక్ష ఇప్పుడు ప్రారంభమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్టార్ హీరో క్రేజ్‌తో ఓపెనింగ్స్ సాధించడం ఒక ఎత్తయితే, ప్రేక్షకుల టాక్‌ను తట్టుకుని తర్వాతి రోజుల్లో స్థిరంగా కలెక్షన్లు రాబట్టడం మరో ఎత్తు. రెండో రోజు డ్రాప్ నేపథ్యంలో సినిమా వీకెండ్లో ఎలా పుంజుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ‘ఇరుముడి’కి వస్తున్న ఆదరణ కొనసాగితే వీకెండ్లో ఆ సినిమా మరింత బలమైన వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మౌత్ టాక్‌తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అవకాశం ‘ఇరుముడి’కి కలిసివచ్చే అంశంగా కనిపిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

