Adrishya Jalakangal | టోవినో థామస్‌తో మైత్రీ మూవీ మేకర్స్ కొత్త సినిమా.. ఆసక్తికరంగా ‘అదృశ్య జలకంగల్’ ట్రైలర్
Adrishya Jalakangal Movie | ఈ ఏడాది 2018 మూవీతో బ్లక్ బస్టర్ అందుకున్న మలయాళ నటుడు టోవినో థామస్ (Tovino Thomas) వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే ‘నడిగర్ తిలకం’ (Nadigar Thilakam), అజాయంతే రందం మోషణం(Ajayante Randam Moshanam), అన్వేషిప్పిన్ కండెతుమ్ (Anweshippin Kandethum) సినిమాలతో బిజీగా ఉన్న టోవినో తాజాగా మరో ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాడు.
Adrishya Jalakangal Movie | ఈ ఏడాది 2018 మూవీతో బ్లక్ బస్టర్ అందుకున్న మలయాళ నటుడు టోవినో థామస్ (Tovino Thomas) వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే ‘నడిగర్ తిలకం’ (Nadigar Thilakam), అజాయంతే రందం మోషణం(Ajayante Randam Moshanam), అన్వేషిప్పిన్ కండెతుమ్ (Anweshippin Kandethum) సినిమాలతో బిజీగా ఉన్న టోవినో తాజాగా మరో ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాడు. టోవినో థామస్(Tv), నిమిషా సజయన్(Nimisha Sajayan), ఇంద్రన్ (Indran) ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం అదృశ్య జలకంగల్ (Adrishya Jalakangal ). నేషనల్ అవార్డు విన్నర్ డా. బిజుకుమార్ దామోధరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేసింది.
యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో టోవినో థామస్ (Tovino Thomas) చనిపోయిన వారితో మాట్లాడటం, ఆ విషయం చెప్పిన అతడిని ఎవరు నమ్మకపోవడం కనిపిస్తున్నాయి. అలాగే ట్రైలర్లో కనిపించే వరుస యుద్ధ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోరు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇక తెలుగు టాప్ ప్రోడక్షన్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి టోవినో థామస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. నవంబర్ 24న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరోవైపు ఈ సినిమా విడుదలకు ముందే అరుదైన ఘనత సాధించింది. ఎస్టోనియా దేశంలోని టాలిన్ నగరంలో జరిగే ప్రతిష్టాత్మకమైన టాలిన్ బ్లాక్ నైట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఈ సినిమా అధికారికంగా ఎంపికైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

