Car: సినీ ఫక్కీలో హీరో కారు దొంగతనం

అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నహాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ కారుని సినీ ఫక్కీలో దొంగలించారు. దాదాపు కోటి రూపాయల విలువగల ఈ బీఎండబ్ల్యూను చివరకు పోలీసులు ఎలాగోలా ట్రేస్ చేశారు. కానీ కారులోని విలువైన లగేజీ కొంత డబ్బును మాత్రం దొంగలు ఎత్తుకెళ్లిపోయారు.
ఇంగ్లండ్‌లోని బర్మింగ్ హామ్లో మిషన్ ఇంపాజిబుల్ ఏడో పార్ట్ షూటింగ్ జరుగుతోంది. ఓ లగ్జరీ హోటల్ లో సినిమా యూనిట్ బస చేసింది. ఈ క్రమంలో టామ్ క్రూజ్ బయట పార్కింగ్ చేసిన కాస్ట్ లీ కారును దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. మోడ్రన్ కారులకి తాళాలు లేకుండా ఇగ్నీషన్ వస్తుండగా, దానికి ఉన్న వైర్ లెస్ ట్రాన్స్ మీటర్లను ఉపయోగించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇదే తీరులో టామ్ క్రూజ్ కారును కూడా చోరీ చేశారు.
చాలా తెలివిగా కారు దొంగతనం చేయగా, ఈ విషయంపై టామ్ క్రూజ్ బాడీగార్డులు పోలీసులకు సమాచారం అందించారు. ట్రాకింగ్ సిస్టం ద్వారా కారును ట్రేస్ చేశారు. స్మెత్ విక్ విలేజ్ లో కారును గుర్తించారు. అయితే కారు దొరికినప్పటికీ అందులోని లగేజీ కొంత డబ్బు మాయమైనట్లు తెలుస్తోంది. ఈ కారు విలువ దాదాపు లక్ష పౌండ్లు( మన కరెన్సీలో కోటి రూపాయలు). బీఎండబ్ల్యూ ఎక్స్7 గా పేరు గావించిన ఈ కారు అత్యధికంగా 249 కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- car
- theft
- Tom Cruise
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

