Kota Srinivasa Rao | ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూత
ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) కన్నుమూశారు. 83 ఏండ్ల వయస్సున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్: .ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) కన్నుమూశారు. 83 ఏండ్ల వయస్సున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన కోటా 750కిపైగా చిత్రాల్లో నటించారు. తన 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. తొమ్మిది నది పురస్కారాలు అందుకున్న ఆయనను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కోటా ప్రసాద్ ఉన్నారు. 2010 జూన్ 21న రోడ్డుప్రమాదంలో ప్రసాద్ మృతిచెందారు. కోటా మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో కోటా శ్రీనివాసరావు జన్మించారు. బాల్యం నుంచి నాటకాలంటే చాలా ఆసక్తి కనబడిరిచేవారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’తో సినీరంగంలోకి అరంగ్రేటం చేశారు. కోట శ్రీనివాసరావుకు దర్శక నిర్మాత క్రాంతికుమార్ తొలి అవకాశం ఇచ్చారు. తన నటన, డైలాగ్ డెలివరీతో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా, హాస్యం, విలనిజం, సెంటిమెంట్, పౌరాణికం… ఇలా ఏ తరహా పాత్రనైనా తనదైన శైలిలో పండించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు స్టేట్‌బ్యాంకులో పనిచేశారు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. 1990లలో బీజేపీలో చేరిన ఆయన 1999-2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2023లో వచ్చిన ‘సువర్ణ సుందరి’ ఆయన చివరి చిత్రం. ప్రతిఘటన, గాయం, తీర్పు, లిటిల్ సోల్జర్స్, గణేష్, చిన్నా, ఆ నలుగురు, పెళ్లైన కొత్తలో చిత్రాలకు గాను నంది అవార్డులు అందుకున్నారు.

కోటను ఓవర్‌నైట్‌లో స్టార్‌ను చేసిన సినిమా ఏదంటే..
కెరీర్ మొదట్లో స్టేజీపై నాటకాలు ప్రదర్శించే ఈయన.. అంచలంచెలుగా ఎదుగుతూ తెలుగు సినిమా విలనిజానికి కొత్త భాష్యాన్ని నేర్పాడు. అయితే ప్రారంభంలో సినిమాల అవకాశాల కోసం అందరిలాగే కోట శ్రీనివాసారావు కూడా కష్టపడేవాడు. ప్రాణం ఖరీదు, కుక్క అనే సినిమాల్లో చిన్ని చిన్న వేషాలతో కెరీర్ మొదలుపెట్టి, వందేమాతరం సినిమాలో మంచి పాత్రను సంపాందించాడు.
అయితే ఇవన్నీ కాకుండా తను సినీ పరిశ్రమలో పాతుకపోవడానికి కారణమైన సినిమా గురించి కోట ఓ సందర్భంలో చెప్పారు. నా కెరీర్‌కు కీలకమైన సినిమా ప్రతిఘటన (Pratighatana) . ఇది నా కెరీర్‌ను స్టాండ్ చేసుకోవడానికి ఉపయోగపడింది. వందేమాతరం సినిమా చేస్తున్నప్పుడు టి.కృష్ణ నాకు ఈ సినిమా గురించి చెప్పాడు. అయితే మొదట కథ చెప్పినప్పుడు నా పాత్ర ఇందులో కూడా చిన్నదే. పార్టీ అధ్యక్షుడుగా ఒకే సన్నివేశం రాశారు నా కోసం.
సోదరి సోదరిమణులారా అని ప్రసగించాల్సిన సీన్ అది. ఇక ఆ డైలాగ్‌ను నా శైలిలో తెలంగాణ యాసలో చెప్పేసరికి టి.కృష్ణ అది బాగా నచ్చింది. అప్పుడు అక్కడ వున్న రచయిత పీఎల్ నారాయణకు చెప్పి నా మీద అదే శైలిలో మరో నాలుగైదు సీన్లు రాయమని చెప్పారు టి.కృష్ణ. రాత్రంతా కూర్చుని నా కోసం ఎనిమిది సన్నివేశాలు ప్రీపేర్ చేశారు. షూటింగ్ పూర్తయింది.. సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా తెచ్చిన పేరు గురించి అందిరికి తెలిసిందే. ఓవర్‌నైట్‌లో ప్రతిఘటన సినిమా నన్ను స్టార్‌ను చేసింది. ఆ తరువాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు’ అని చెప్పుకొచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

