SS Rajamouli | ఆ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళుతున్న రాజమౌళి.?
Premalu Movie | టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళికి సినిమాలంటే పిచ్చి అన్న విషయం తెలిసిందే. శుక్రవారం ఏ సినిమా విడుదలైన టాక్ బాగుంటే థియేటర్‌కు చెక్కేస్తాడు. ఇక రాజమౌళి చాలావరకు ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లోనే సినిమా చూడటానికి వెళతారు. అయితే తాజా సమాచారం ప్రకారం రాజమౌళి మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ప్రేమలు సినిమా చూడటానికి వెళుతున్నట్లు టాక్.
Premalu Movie | టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళికి సినిమాలంటే పిచ్చి అన్న విషయం తెలిసిందే. శుక్రవారం ఏ సినిమా విడుదలైన టాక్ బాగుంటే థియేటర్‌కు చెక్కేస్తాడు. ఇక రాజమౌళి చాలావరకు ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లోనే సినిమా చూడటానికి వెళతారు. అయితే తాజా సమాచారం ప్రకారం రాజమౌళి మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ప్రేమలు సినిమా చూడటానికి వెళుతున్నట్లు టాక్.
మలయాళం నుంచి వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘ప్రేమలు’. గిరీష్ ఎడి దర్శకత్వం వహించిన ఈ సినిమా హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చి ఈ సంవత్సరం మాలీవుడ్‌లో విడుదలైన బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఇదే సినిమాను తెలుగులో రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ విడుదల చేస్తున్నారు. మార్చి 08న తెలుగు వెర్షన్ విడుదల కానుంది. ఇక సినిమాకు టాక్ మంచిగా రావడం.. మరోవైపు కొడుకు రిలీజ్ చేస్తున్న సినిమా కావడంతో మూవీపై బజ్ ఏర్పడటానికి రాజమౌళి ఈ సినిమా చూడనున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో రేపు ఉదయం 11:45 గంటలకు రాజమౌళి ఈ సినిమాను చుడనున్నట్లు సమాచారం. రాజమౌళితో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ స్క్రీనింగ్‌లో పాల్గొననున్నారు.
ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్(Fahad Fazil) నిర్మించిన ఈ సినిమాను గిరీష్ ఏడీ(Girish AD) దర్శకత్వం దర్శకత్వం వహించగా.. నస్లేన్, మమితా, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రలు పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

