Mangalavaaram | ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి (Ajay Bhupathi), పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) కాంబినేషన్లో వస్తోన్న సినిమా మంగళవారం (Mangalavaaram). హార్రర్ కామెడీ జోనర్లో ఫీ మేల్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇక మహాసముద్రంతో అల్ట్రా డిజాస్టర్ సాధించిన అజయ్ భూపతి (Ajay Bhupathi) ఈ సారి హార్రర్ కమ్ థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకుని జనాలను భయపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా నవంబర్ 17న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ ఇప్పటినుంచే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరో ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. అయితే ఈ హీరో ఎవరు అనేది చిత్రబృందం ప్రకటించలేదు కానీ దానికి సంబంధించి ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ పోస్టర్ చూస్తే.. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Iconstar Allu arjun) అతిథిగా రాబోతున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఈరోజు సాయంత్రం 5 గంటలకు అధికారిక ప్రకటన రానుంది.
He’s Coming 🔥💥😎🤙🏻
Guess the Chief Guest of #Mangalavaaram Pre-release Event 😉
Stay tuned for announcement today, 5 PM 😍
An @DirAjayBhupathi‘s Vision 🎬
An @AJANEESHB Musical 🎶#MangalavaaramOnNov17th @starlingpayal @Nanditasweta @MudhraMediaWrks @ACreativeWorks_… pic.twitter.com/eMsmsXqg0U— BA Raju’s Team (@baraju_SuperHit) November 9, 2023
మంగళవారం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 17న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. మంగళవారం గ్లింప్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నందితా శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.