పెళ్లి చూపులు సినిమాతో సోలో హీరోగా బ్రేక్ అందుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీతగోవిందం చిత్రాలతో మంచి స్టార్ డమ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) . ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టు లైగర్ తో ప్రేక్షకులను పలుకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ యువ హీరో రేపు 33వ పుట్టినరోజు (VDk 33rd birthday) వేడుకలకు ముస్తాబవుతున్నాడు. ఈ నేపథ్యంలో కొత్త అప్ డేట్స్ ఏమైనా ఉన్నాయా..? అంటూ అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.
అంతేకాదు తమ అభిమాన హీరో బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా జరిపేందుకు రెడీ అవుతున్నారు. ఇవాళ సాయంత్రం 8 గంటలకు విజయ్ సీడీపీ కామన్ డిస్ప్లే పిక్చర్ (సీడీపీ)ని (Vijay Deverakonda CDP) లాంఛ్ చేయనున్నారు. సీడీపీని నలుగురు హీరోయిన్లు లాంఛ్ చేయనుండటం విశేషం. సమంత, నభా నటేశ్, ప్రగ్యాజైశ్వాల్, ఛార్మీ కౌర్‌తోపాటు డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సీడీపీని లాంఛ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం శివనిర్వాణ డైరెక్షన్లో ప్రేమకథ నేపథ్యంలో వస్తున్న సినిమాలో నటిస్తున్నాడు.
సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ ప్రాజెక్టు కశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే సామ్ పుట్టినరోజును విజయ్ టీం కశ్మీర్ లోనే జరిపింది. స్పెషల్ వీడియో ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. పూరీజగన్నాథ్‌తో మరో ప్రాజెక్టు జనగణమన ప్రకటించాడు విజయ్ దేవరకొండ.