Rashmika Mandanna | అలా చేస్తే ఇంట్రెస్ట్ ఏం వస్తుంది.. లీకువీరులపై రష్మిక సీరియస్..
Rashmika Mandanna | పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కేవలం టాలీవుడ్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. నిజానికి ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమయ్యింది.
Rashmika Mandanna | పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కేవలం టాలీవుడ్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. నిజానికి ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమయ్యింది. దీంతో శరవేగంగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు పుష్పరాజ్ లీకుల బెడదను ఎదుర్కొంటోంది. ఎంత పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్నా కానీ.. సినిమాకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చేస్తున్నాయి. ఇలా తమ సినిమాను టార్గెట్ చేసిన లీకువీరులపై నేషనల్ క్రష్ రష్మిక మందన సీరియస్ అయ్యారు.
పుష్ప 2 సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఇటీవల రెండు ఫొటోలు లీకయ్యాయి. ఒక దాంట్లో అల్లు అర్జున్ చీర కట్టుకున్నట్లుగా ఉన్న లుక్ బయటకు రాగా.. భారీగా నగలు ధరించిన రష్మిక ఫొటో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఇలా ఒక్కో సీన్‌కు సంబంధించిన ఫొటోలు లీకవ్వడంపై రష్మిక మంధన అసహనం వ్యక్తం చేశారు. షూటింగ్ సెట్ నుంచి నటీనటుల ఫొటోలు లీక్ చేయడం కరెక్ట్ కాదని సూచించింది. ఈ సినిమా చూడాలని ఇంకా ఎంతోమంది ఎదురుచూస్తున్నారని.. అలా అని లీకైన ఫొటోలను షేర్ చేయడం మంచిది కాదని చెప్పింది. ఇలా సినిమాకు సంబంధించిన ఫొటోలను ముందే చూసేస్తే.. తర్వాత మూవీ విడుదలయ్యాక ఏమాత్రం ఆసక్తి ఉండదని తెలిపింది. థియేటర్లో ప్రేక్షకులకు 100 శాతం వినోదాన్ని పంచేందుకు సినిమా యూనిట్ అంతా కష్టపడుతున్నారని.. దయచేసి తమ సినిమా ప్రైవసీకి భంగం కలిగించవద్దని సూచించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

