Kriti Kharbanda | నాకైతే అలాంటి డ్రెస్సులు వేసుకోవడం అంటేనే ఇష్టం: కృతి ఖర్బందా
Kriti Kharbanda | ‘బోణీ’ చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన నటి కృతి ఖర్బందా. ‘ఒంగోలు గిత్త’, ‘ఓమ్' తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ బాలీవుడ్లో అడపాదడపా మెరుస్తూనే ఉంది. ఇప్పుడు సినిమాలకు కాస్త దూరం పాటిస్తున్నా... సామాజిక మాధ్యమాల్లో మాత్రం హల్చల్ చేస్తూనే ఉన్నది. ఒకట్రెండు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో తన అదృష్టం పరీక్షించుకుంటున్నది. కృతి ఇంకేం కబుర్లు చెబుతుందో విందాం..
Kriti Kharbanda | ‘బోణీ’ చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన నటి కృతి ఖర్బందా. ‘ఒంగోలు గిత్త’, ‘ఓమ్’ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ బాలీవుడ్లో అడపాదడపా మెరుస్తూనే ఉంది. ఇప్పుడు సినిమాలకు కాస్త దూరం పాటిస్తున్నా… సామాజిక మాధ్యమాల్లో మాత్రం హల్చల్ చేస్తూనే ఉన్నది. ఒకట్రెండు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో తన అదృష్టం పరీక్షించుకుంటున్నది. కృతి ఇంకేం కబుర్లు చెబుతుందో విందాం..
తెలుగు చిత్రం ‘బోణీ’తో మొదటిసారి ప్రేక్షకులను పలకరించాను. నా మాతృభాష పంజాబీ. హిందీ, ఇంగ్లిష్‌లో మంచి పట్టు ఉంది. బెంగళూరులో పెరగడం వల్ల కన్నడంలోనూ కొద్దోగొప్పో ప్రవేశం ఉండేది. నా థర్డ్ లాంగ్వేజ్ కన్నడమే! దీంతో కూడబలుక్కొని మాట్లాడేదాన్ని. మొదటి సినిమా అవకాశం రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. కానీ, తెలుగులో డైలాగ్‌లు చెప్పడం ఎలాగో తెలియక కంగారుపడ్డాను. డైలాగ్ మీద పట్టు దొరికితే ఎక్స్ప్రెషన్స్ మిస్ అయ్యేవి, హావభావాలపై దృష్టిపెడితే డైలాగ్‌లు మర్చిపోయేదాన్ని. తొలినాళ్లలో ఇలాంటి సమస్యలు చాలా ఫేస్ చేశాను. తెలుగు నేర్చుకోవడానికి హోమ్ ట్యూషన్ కూడా పెట్టుకున్నా. పదాలు ప్రాక్టీస్ కావడానికి సెట్లో అందరితో వచ్చీరాని తెలుగు మాట్లాడుతూ ఉండేదాన్ని. అలా మెల్లమెల్లగా భాషపై పట్టు సాధించా!
‘బోణీ’ తర్వాత తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. అలా మొదలైంది, తీన్మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం, బ్రూస్ లీ వంటి సినిమాలు నన్ను నటిగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేశాయి. కన్నడంలో వరుస అవకాశాలు వచ్చాయి. 2016లో ‘రాజ్ రీబూట్’ద్వారా బాలీవుడ్‌కు పరిచయమయ్యా! తమిళ సినిమాల్లోనూ గుర్తుంచుకోదగ్గ పాత్రలు పోషించాను.
నాకు యాక్షన్ సీక్వెన్స్ చేయాలంటే సరదా! ‘హౌజ్‌ఫుల్ 4’తో ఆ కోరిక తీరింది. ఫుల్‌లెంగ్త్ యాక్షన్ మూవీలో నటించాలని కూడా ఉంది. అదెప్పటికి నెరవేరుతుందో చూడాలి. ఏదో ఒకరోజు అదీ నిజమవుతుంది.
నేను ఢిల్లీలో పుట్టాను. పెరిగిందంతా బెంగళూరులో. పంబాబీ అమ్మాయిని కావడంతో హిందీ సినిమాలు, పాటలు అంటే ఆసక్తి ఉండేది. చిన్నప్పుడు టీవీలో ఏ పాట వచ్చినా నాకు తోచినట్టు డ్యాన్స్ చేసేదాన్ని. అలా తెలియకుండానే నటనపై ఆసక్తి ఏర్పడిందేమో! కానీ, సినిమాల్లోకి రావాలని ఏనాడూ అనుకోలేదు. అయితే, నా ప్రపంచం చాలా కొత్తగా ఉండాలని మాత్రం బలంగా కోరుకునేదాన్ని.
ఎవరికైనా కెరీర్లో గెలుపోటములు సహజం. నేను జయాపజయాలను సమానంగా తీసుకుంటాను. కొందరు ‘ఫలానా సినిమాలో ఆ పాత్ర ఎందుకు చేశావు?’ అని అడుగుతుంటారు. కానీ, కథ, పాత్ర నాకు మనస్ఫూర్తిగా నచ్చితేనే సినిమాకు ఓకే చెబుతాను. ‘షాదీ మే జరూర్ ఆనా’ కామెడీ ప్రాధాన్యం ఉన్న సినిమా. అది చేస్తున్నప్పుడు చాలామంది ఇలాగే అన్నారు. కానీ, సినిమా విడుదలయ్యాక చాలా బాగా చేశావని అందరూ మెచ్చుకున్నారు.
సినిమాల్లోకి రాకపోయి ఉంటే జువెలరీ డిజైనర్‌గా సెటిలయ్యేదాన్ని. అందులో నేను డిప్లొమా కూడా చేశాను. భవిష్యత్తులో ఈ రంగంలో స్థిరపడాలని భావిస్తున్నా. ఫ్యాషన్ డిజైనింగ్‌లోనూ ఆసక్తి ఉంది. నా వరకైతే సంప్రదాయ దుస్తుల్లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తాను. అవి నాకు బాగా నప్పుతాయనిపిస్తుంది.
Read More :
Kriti Kharbanda | సరికొత్త ఫోజులతో మతులు పోగొడుతున్న కృతి కర్బంద..
Kriti Kharbanda | స్లీవ్ లెస్ డ్రెస్‌లో మతులు పోగొడుతున్న కృతి కర్బంద..”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

