మామూలు డ్యాన్స్ ఎవ్వరైనా చేస్తారు. కానీ.. పోల్ డ్యాన్స్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ మధ్య పోల్ డ్యాన్స్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. చాలామంది సెలబ్రిటీలు పోల్ డ్యాన్స్ చేస్తున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
తాజాగా నటి కృతి కర్బందా కూడా పోల్ డ్యాన్స్ చేసింది. ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని తను వేసిన పోల్ డ్యాన్స్ చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. వామ్మో.. కృతి కర్బందాలో ఈ టాలెంట్ కూడా ఉందా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
తెలుగులో పలు సినిమాల్లో నటించిన కృతి.. ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసింది. ప్రస్తుతం కృతి.. బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్‌తో డేటింగ్లో ఉంది. వాళ్లిద్దరూ కలిసి వీరే కి వెడ్డింగ్, పాగల్పంటి, టైష్ అనే సినిమాల్లో నటించారు.