Anupama Parameswaran |ఖాళీ టైమ్‌లో మలయాళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్ ఏం చేస్తుందో తెలుసా !
Anupama Parameswaran| పరిచయం అక్కర్లేని కేరళ కుట్టి.. అనుపమ పరమేశ్వరన్. పక్కింటి పిల్లలా.. మనలో కలిసిపోయిందీ అమ్మాయి. ‘ప్రేమమ్'తో పరిచయమై.. మన ప్రేమను గెలుచుకుంది. త్వరలో రానున్న ‘డీజేటిల్లు 2’లో కథానాయిక తనే. ‘మనసులో ఏదీ దాచుకోను.. ఏమున్నా మొహం మీదే చెప్పేస్తా’ అంటూ అను చెప్పిన కార్వాన్ ముచ్చట్లు ..
Anupama Parameswaran | పరిచయం అక్కర్లేని కేరళ కుట్టి.. అనుపమ పరమేశ్వరన్. పక్కింటి పిల్లలా.. మనలో కలిసిపోయిందీ అమ్మాయి. ‘ప్రేమమ్’తో పరిచయమై.. మన ప్రేమను గెలుచుకుంది. త్వరలో రానున్న ‘డీజేటిల్లు 2’లో కథానాయిక తనే. ‘మనసులో ఏదీ దాచుకోను.. ఏమున్నా మొహం మీదే చెప్పేస్తా’ అంటూ అను చెప్పిన కార్వాన్ ముచ్చట్లు ..
కేరళలోని త్రిస్సూర్ జిల్లా ఇరింజలకుడలో పుట్టాను. నాన్న పరమేశ్వరన్, అమ్మ సునీత. సీఎంఎస్ కాలేజీలో ఇంటర్ చదివాను. కాకపోతే, సినిమాల కోసం చదువుకు ఫుల్స్టాప్ పెట్టేశా. ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతాను. నాకు నచ్చకపోతే డైరెక్ట్‌గా చెప్పేస్తాను.
జీవితం చాలా చిన్నది. ఉన్న ఈ కొద్ది సమయంలో అంత ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం లేదు. పనికిరాని చెత్తను నా మెదడులో స్టోర్ చేయను. ఎప్పటికప్పుడు డిలిట్ చేస్తా.
‘ప్రేమ లేకుండా ఈ ప్రపంచం లేదు. భావోద్వేగాలు లేని జీవితమూ లేదు. ఈ రెండూ కలిస్తేనే మనిషి.. ప్రపంచం’.. 18 పేజెస్ సినిమాలో నాకు బాగా నచ్చిన డైలాగ్ ఇది. ఎంత గొప్ప మాట.
నాన్‌వెజ్ ఫుల్‌గా లాగించేస్తా. చికెన్ గారెలు చాలా ఇష్టం. వెజ్ వంటలూ తింటాను. నోటికి రుచిగా, వంటికి ఆరోగ్యంగా ఉంటే చాలు.. ఫుడ్ విషయంలో రూల్స్ పెట్టుకోను.
జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు చాలా బాధపడుతుంటాం. ‘రంగస్థలం’ మిస్ అయినప్పుడు చాలా బాధపడ్డా. ఒకవేళ ఆ సినిమాలో నటించి ఉంటే.. అదే నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా
అయ్యేదేమో!

ఖాళీ సమయం దొరికితే పెయింటింగ్స్ వేస్తా. పాటలు పాడతా. షూటింగ్ లేకుండా ఇంట్లో ఉన్నానంటే మా అమ్మ చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఎందుకంటే.. తనకు బోలెడు కబుర్లు చెబుతానుగా!
ఒప్పుకొన్న సినిమాలన్నీ అయిపోయాక.. కొంత గ్యాప్ తీసుకుంటా. డైరెక్టర్లు, టెక్నికల్ టీమ్ దగ్గర కొన్ని అంశాలపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకొని సొంతంగా సినిమా డైరెక్ట్ చేయాలని
నా డ్రీమ్. కానీ.. ఆ సినిమాలో నేను మాత్రం నటించను.
మీకో విషయం తెలుసా.. దుల్కర్ సల్మాన్ నటించిన ‘మనియారయిలే అశోకన్’ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా నేను. ఆ సినిమా 2019లో వచ్చింది.
నాకు ఓనమ్ పండుగ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ పండుగ మిస్ అవలేదు. కానీ.. సినిమాల్లోకి వచ్చాక చాలాసార్లు మిస్సయ్యాను. బట్.. కరోనా టైమ్‌లో ఫ్యామిలీతో కలిసి పండుగ జరుపుకొన్నా. ఆ ఏడాది చాలా హ్యాపీగా ఫీలయ్యా.
నాకు పెట్స్ అంటే ప్రాణం. మన ఫీలింగ్స్‌ను మరో ఆలోచన లేకుండా అర్థం చేసుకునేవి, స్వార్థం లేకుండా స్పందించేవి అవే అని నా భావన. అందుకే ఓ కుక్కని పెంచుకుంటున్నా. దాని పేరు.. విస్కీ. నా బెస్ట్ ఫ్రెండ్ అదే.
అప్పుడెప్పుడో ఓ వ్యక్తిని ఇష్టపడ్డా. బట్.. మధ్యలోనే బ్రేకప్ అయిపోయింది. బుమ్రా అని, రామ్ అని చాలా పుకార్లు వచ్చాయి. వాళ్లు నాకు మంచి ఫ్రెండ్స్ అంతే. నా ప్రేమ గురించి ఏమైనా ఉంటే.. కచ్చితంగా మీతో పంచుకుంటా.
Read More :
“Anupama Parameswaran | సరికొత్త సెల్ఫీలతో మతులు పోగొడుతున్న అనుపమ పరమేశ్వరన్..”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

