Sudheer Varma | యువ నటుడు సధీర్వర్మ బలవన్మరణం టాలీవుడ్‌ను కలిచివేసింది. ‘సెకండ్ హ్యండ్’, ‘కుందనపు బొమ్మ వంటి’, ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ వంటి పలు సినిమాల్లో నటించిన సుధీర్ బాబు జనవరి 18న విషం తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ విషయం గమనించిన ఆయన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం సుధీర్ వర్మను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం సుధీర్‌ను విశాఖలోని ఎల్. జీ. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించడం మొదలు పెట్టారు. చికిత్స పొందుతూనే సోమవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో సుధీర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కాగా ఆయన సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలను బంధువులు తెలిపారు. గత కొన్ని రోజులుగా సుధీర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. దాంతో ఆ సమస్యలను తట్టుకోలేక సుధీర్ వర్మ విషం తాగినట్లు వెల్లడించారు. ఇంత చిన్న వయసులో సుధీర్ వర్మ బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలిచి వేసింది. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సుధీర్ వర్మతో కలిసి ‘కుందనపు బొమ్మ’లో నటించిన సుధాకర్ కొలిమి ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.