Nani | మళ్లీ టీవీ షో చేయనంటున్న నాని
టాలీవుడ్ (Tollywood) నటుడు నాని (Nani) కేవలం సినిమాలతో వినోదాన్ని పంచడమే కాదు..అవసరమైతే టీవీ స్క్రీన్ పై కూడా కనిపిస్తుంటాడు. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ 2 తర్వాత కేవలం సినిమాలకే పరిమితమైపోయాడు నాని.

టాలీవుడ్ (Tollywood) నటుడు నాని (Nani) కేవలం సినిమాలతో వినోదాన్ని పంచడమే కాదు..అవసరమైతే టీవీ స్క్రీన్ పై కూడా కనిపిస్తుంటాడు. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ 2 ప్రేక్షకులను పసందైన వినోదాన్ని అందించింది. అయితే ఆ తర్వాత కేవలం సినిమాలకే పరిమితమైపోయాడు నాని. అయితే తాను మళ్లీ టీవీ షో (TV Shows) లో కనిపించబోనని చెబుతున్నాడు నాని.
ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ..ఏదైనా టీవీ షోను హోస్ట్ చేయబోతున్నారా..? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ..లేదు..అలాంటి ప్రణాళికలు ఏమి లేవు. ఓ సంస్థకు కూడా ఇదే విషయం చెప్పాను. సోషల్ మీడియాలో కూడా నేను ఏ టీవీ షోను హోస్ట్ చేయడం లేదనే విషయం పోస్ట్ చేశాను. ఏదైనా షో చేయాలంటే దానిపై చాలా అంచనాలుంటాయి. సినిమా మైండ్‌తో నిద్రలేస్తా..సినిమా గురించే ఆలోచిస్తూ నిద్రపోతా.
టీవీ షోలను వేరే వ్యక్తులైతే నా కన్నా ఉత్తమంగా హ్యాండిల్ చేస్తారు. కానీ టీవీ షో చేసినందుకు నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. టీవీ షో హోస్ట్ చేయడం ద్వారా నేను చాలా సహనాన్ని అలవాటు చేసుకున్నాను. సినిమా సమావేశాలు, రివ్యూలు, నా ఇంటర్వ్యూల ప్రపంచంలో నివసించే నాలాంటి వ్యక్తికి ఇది టీవీ అనేది భిన్నమైన ప్రపంచం అంటూ చెప్పుకొచ్చాడు నాని. ఈ స్టార్ హీరో ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలు చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
Nani | షాహిద్ కపూర్ గొప్ప నటుడు..రీమేక్ అద్భుతం
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Bheemla nayak: ఇక వరుస సర్ప్రైజ్లతో సందడి చేయనున్న రానా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

