Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Vivek Athreya's 'Thulabharam' | మాస్ మహారాజా రవితేజ, వైవిధ్యమైన సినిమాల దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి మేకర్స్ ఒక సరికొత్త అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Vivek Athreya’s ‘Thulabharam’ | మాస్ మహారాజా రవితేజ, వైవిధ్యమైన సినిమాల దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి మేకర్స్ ఒక సరికొత్త అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు ‘తులాభారం’ (Thulabharam) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ, చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన టైటిల్ డాక్యుమెంటరీని విడుదల చేసింది.
బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వివేక్ ఆత్రేయ తనదైన మార్క్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, రాక్ స్టార్ వివేక్ సాగర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. రవితేజ మార్క్ ఎనర్జీకి, వివేక్ ఆత్రేయ రాసే బలమైన పాత్రలు, కథనం తోడైతే ఈ సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమా అనుభూతిని పంచుతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తాజాగా విడుదల చేసిన ‘తులాభారం’ టైటిల్ డాక్యుమెంటరీ సినిమాపై ఉన్న క్యూరియాసిటీని మరింత పెంచేలా ఉంది. చిత్ర నిర్మాణం, బ్యాక్‌గ్రౌండ్ వర్క్‌కు సంబంధించిన విశేషాలను ఈ డాక్యుమెంటరీ ద్వారా పంచుకున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, నటీనటుల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్, అనాస్వరా రాజన్ కథానాయికులుగా నటిస్తుండగా.. జేడీ చక్రవర్తి, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో నటించబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

