Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Jailer2 Review | రజనీకాంత్ ‘జైలర్' సినిమా ఆయన కెరీర్లోనే టాప్ గ్రాసర్‌గా నిలిచింది. దాదాపు 650కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టిన సినిమా అది. సాధారణంగా సూపర్‌స్టార్ సినిమాకు అంచనాలు సహజం.
సినిమా పేరు: జైలర్ 2
తారాగణం: రజనీకాంత్, మోహన్‌లాల్, శివరాజ్కమార్, హృతిక్‌రోషన్, మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్, రమ్యకృష్ణ, ఎస్.జె.సూర్య..
దర్శకత్వం: నెల్సన్ దిలీప్‌కుమార్
నిర్మాణం: కళానిధి మారన్..
సంగీతం: అనిరుథ్
రజనీకాంత్ ‘జైలర్’ సినిమా ఆయన కెరీర్లోనే టాప్ గ్రాసర్‌గా నిలిచింది. దాదాపు 650కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టిన సినిమా అది. సాధారణంగా సూపర్‌స్టార్ సినిమాకు అంచనాలు సహజం. అందునా ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ ‘జైలర్’కు సీక్వెల్ అనగానే మళ్లీ తెరపై టైగర్ మత్తువేల్ పాండియన్ జారీ చేసే హుకుం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకొని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తలైవా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం ‘జైలర్ 2’ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఎన్నో విడుదల తేదీలను మార్చుకున్న ఈ సినిమా ఎట్టకేలకు గురువారం విడుదలైంది. మరి ‘జైలర్’ స్థాయిలో ‘జైలర్ 2’ ఉన్నాడా? మళ్లీ టైగర్ ముత్తువేల్ పాండియన్ తనదైన స్టెల్లో తనదైన గ్రేస్‌తో వెండితెరను షేక్ చేశాడా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందు కథలోకి వెళ్లాలి…
కథ
రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్ తన కొడుకుతోపాటు విలన్ వర్మ(వినాయకన్)ను కూడా చంపడంతో ‘జైలర్’ కథ ముగిసింది. ఇక తమ అనుచరుడైన వర్మను చంపిన వ్యక్తి కోసం ప్రమాదకరమైన కల్పక్ కుటుంబం (ఎస్.జె.సూర్య ఫ్యామిలీ) వెతకడం మొదలుపెట్టడంతో ‘జైలర్ 2’ కథ మొదలవుతుంది. ఓపెన్‌చేస్తే.. రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్ ఓ సూపర్ మార్కెట్లో సూపర్వైజర్గా పనిచేస్తుంటాడు. తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్న ముత్తువేల్ పాండియన్ చుట్టూ కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అనుకోని సమస్యలు చుట్టుకుంటాయి. గడిచిన సంఘటన ప్రతిఫలం ఇంకా తనను వెంటాడుతున్నదని, తన కుటుంబం సమస్యల్లో ఉన్నదని ముత్తువేల్కి అర్థమవుతుంది. దాంతో తను అలర్ట్ అవుతాడు. తనకోసం వెతుకుతున్న వాళ్లను ట్రాప్‌లోకి దించి, ఒక్కో సమస్యలను అధిగమించుకుంటూ, కల్పక్ కుటుంబాన్ని ముత్తువేల్ ఏ విధంగా అంతమొందించాడు? అనేది మిగతా కథ.
విశ్లేషణ
తొలి పార్ట్ ముగింపులోనే రాబోయే సమస్య గురించి డిస్కస్ చేశాడు దర్శకుడు నెల్సన్. ఆ సమస్యను ఎస్.జె.సూర్య కుటుంబం రూపంలో చాలా భయంకరంగా రివీల్ చేశాడు. తొలి పార్ట్‌లో ముత్తువేల్ పాండియన్ మాత్రమే ఆడియన్స్‌కి డైనోసార్లా కనిపించాడు. ఈ సెకండ్ పార్ట్‌లో విలన్లతో కలిపి ఓ జురాసిక్ పార్క్‌నే చూపించేశాడు నెల్సన్. తెరపై మానవరూపంలో ఉన్న డైనోసార్లు కొట్టుకున్నట్టుంది సినిమా. ఒక్కో సమస్యని అధిగమిస్తూ, ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో సినిమాను నడిపించాడు నెల్సన్. రజనీకాంత్‌ని శారీరకంగా ఆయన పెద్ద ఇబ్బంది పెట్టలేదు. కేవలం ఆయన చరిష్మాను, ఆయన స్టైల్‌ని, ఆయన ఆరాని మాత్రమే వాడుకుంటూ ఓ సూపర్‌స్టార్‌తో సినిమా ఎలా తీయాలో చూపించాడు నెల్సన్. టైగర్ చేతిలో ఆయుధాల్లా మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, హృతిక్‌రోషన్ అదరగొట్టేశాడు. వాళ్ల స్క్రీన్ ప్రెజన్స్ ఓ రేంజ్లో ఉంది. జాకీష్రాఫ్ క్యారెక్టర్ అంతగా ఆకట్టుకోలేదు. సినిమా ఆద్యంతం ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తోనూ ఎమోషనల్‌గా సాగింది. ముఖ్యంగా పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ తలైవా నటించిన తీరు సూపర్. నెల్సన్ స్క్రీన్‌ప్లే ఈ సినిమా ప్రాణం. ముఖ్యంగా క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెస్ సినిమాకే హైలైట్. అయితే.. ‘జైలర్’ ఫస్ట్ పార్ట్‌లో ఉన్నన్ని భావోద్వేగాలు సెకండ్ పార్ట్‌లో కనిపించవు. రజనీ మార్క్ ఎలివేషన్స్, అతిథి పాత్రలు అకట్టుకున్నా.. ఓ సందర్భంలో ఫస్ట్ పార్ట్నే చూస్తున్న ఫీల్ కలుగుతుంది. అభిమానులకు మాత్రం ఈ సినిమా విజువల్ ఫీస్టే.
నటీనటులు
జైలర్ మత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ మరోసారి విశ్వరూపం చూపించారు. సీరియస్‌గా ఉంటూ కామెడీ పండించడం.స్టైలిష్‌గా యాక్షన్‌ని పండించడం.. ముఖ్యంగా కొడుకు విషయంలో తను చేసింది కుటుంబానికి తెలిసిన సందర్భంలో పలికించిన హావభావాలు నిజంగా సూపర్. ఆయనలోని కంప్లీట్ యాక్టర్‌ని ఇందులో చూడొచ్చు. ఇక విలన్ కల్పక్గా సూర్య తనదైన శైలిలో అదరగొట్టేశాడు. విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి నెగిటీవ్ పాత్రల్లో అద్బుతంగా నటించారు.
సాంకేతికంగా..
రజనీకాంత్‌ని చూపించడంపై వందశాతం దృష్టిపెట్టాడు నెల్సన్. కథపై మాత్రం పూర్తిగా దృష్టిపెట్టలేదు. కథపై కూడా ఇంకాస్త వర్క్ చేస్తే సినిమా ఇంకా బాగా వచ్చేది. ఇక అనిరుథ్ ఆర్.ఆర్తో చెలరేగిపోయాడు. పాటలు కూడా వినడానికీ, చూడ్డానికి కూడా బావున్నాయి. ఎడిటింగ్, కెమెరా వర్క్ సమర్ధనీయంగానే ఉన్నాయి. మొత్తంగా సూపర్స్టార్ల సమ్మేళనం ఈ సినిమా. మాస్ ప్రేక్షకులకైతే ఈసినిమా కన్నుల పంటే. తలైవా అభిమానులకైతే విందుభోజనమే అనాలి.
బలాలు : రజనీకాంత్ నటన, సూపర్స్టార్ల్ కలయిక, స్క్రీన్‌ప్లే, అనిరుథ్ నేపథ్య సంగీతం..
బలహీనతలు : అక్కడక్కడ పాత జైలర్ వాసన, తొలిపార్ట్తో పోలిస్తే ఎమోషన్స్ తగ్గడం
రేటింగ్ : 3/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

