సల్మాన్, షారుఖ్ కలిసి నటించే పూర్తి స్థాయి సినిమా కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యష్ రాజ్ ఫిలింస్ సంస్థ ఈ ఇద్దరు హీరోలతో ‘టైగర్ వర్సెస్ పఠాన్’ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల ‘పఠాన్’ చిత్రంలో సల్మాన్ తన టైగర్ క్యారెక్టర్లో అతిథిగా మెరిశారు. ఈ క్రేజ్‌లోనే ‘టైగర్ వర్సెస్ పఠాన్’ రూపకల్పనకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ‘యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా ఉంటుంది. షారుఖ్, సల్మాన్ కాంబినేషన్ అరుదైనది. అందుకే ఈ భారీ చిత్రం గురించి ఇప్పుడే ఏ విషయాన్నీ లీక్ చేయదల్చుకోలేదు’ అని నిర్మాణ సంస్థలోని ఓ వ్యక్తి చెప్పారు.