నోటి దురుసే ఆమె కొంప ముంచింది.. ఆనీ మాస్టర్ ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే..

anee master eliminated from bigg boss 5 telugu | బిగ్ బాస్ 5 తెలుగు నుంచి తాజాగా అనీ మాస్టర్ బయటికి వచ్చేసింది. 11 వారాలు ఇంట్లో ఉన్న ఈమె ఈ వారం ఎలిమినేట్ అయిపోయింది. ఒకరోజు ముందుగానే ఈ విషయం సోషల్ మీడియాలో లీక్ అయింది. చివరి వరకు ప్రియాంక, ఆనీ మాస్టర్ ఎలిమినేషన్ రేసులో ఉన్నారు. చివరి నిమిషంలో ప్రియాంక సేవ్ అయిపోవడంతో ఆనీ ఇంటిముఖం పట్టింది. నిజం చెప్పాలంటే ప్రియాంక కంటే ఆనీ మాస్టర్ స్ట్రాంగ్ ప్లేయర్. సొంతంగా తన కోసం ఆట ఆడింది. ప్రియాంక సింగ్ మాత్రం ఎక్కువగా మానస్‌పై ఫోకస్ చేసి తన గేమ్ మొత్తం పక్కదారి పట్టించింది. ఈ విషయంపై ఆమె విమర్శలు కూడా ఎదుర్కొంది. అయినా కూడా తన ఆటతీరు మార్చుకోవడం లేదు.
ప్రియాంక సింగ్ వీక్ అని తెలిసినా కూడా అనీ మాస్టర్ ఇంటి నుంచి ఎలిమినేట్ అవ్వడం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఆమె నోటి దురుసు. అవసరం ఉన్నప్పుడు చాలా నెమ్మదిగా మాట్లాడే ఆనీ మాస్టర్.. పరిస్థితులు తనకు ప్రతికూలంగా మారితే మాత్రం బహిరంగంగానే అందరి ముందు నోటి దురుసు ప్రదర్శిస్తుంది. ఎవర్నీ లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. గతవారం ఇది మరీ ఎక్కువ అయినట్లు ప్రేక్షకులకు బాగా అర్థం అయింది. కేవలం ఒకే ఒక ఎపిసోడ్ ఈమె జాతకం మార్చేసింది. అప్పటి వరకు ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ ఫైర్ టాస్క్‌లో అనీ మాస్టర్ చేసిన రచ్చతో ఆమె గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.
కేవలం ఇది మాత్రమే కాదు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కంటెస్టెంట్స్ అందరిపై ఆనీ మాస్టర్ నోరు పారేసుకోవడం.. చాలా ఈజీగా ఇన్ఫ్లూయెన్స్ అవుతుండటంతో ప్రేక్షకులు ఇంటి నుంచి ఈమెను బయటికి పంపించేశారు. కచ్చితంగా వచ్చేవారం ప్రియాంక బయటికి రావడం ఖాయం అనే ప్రచారం ఇప్పటి నుంచి మొదలైంది. ఇదే జరిగితే ఇంట్లో చివరి వరకు ఉండే లేడీస్ కాజల్, సిరి మాత్రమే. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈసారి కూడా బిగ్‌బాస్ టైటిల్ అబ్బాయిలకు వెళ్లడం ఖాయమైపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bigg Boss: సేఫ్ అయింది ఎవరు, డేంజర్ జోన్లో ఎవరు?
shanmukh: దీప్తి గుర్తొస్తే బయటకు వెళ్లిపో అంటూ షణ్ముఖ్‌కి వార్నింగ్ ఇచ్చిన నాగ్
Siri: షణ్ముఖ్‌కి చాలా కనెక్ట్ అవుతున్నా.. ఎందుకో అర్ధం కావడం లేదు: సిరి
Sunny: సన్నీకి ఎవిక్షన్ పాస్.. కాజల్ గట్టిగానే ట్రై చేసింది…!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

