బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం ఆసక్తికరంగా సాగుతుంది.’నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా’ టాస్క్ జరుగుతుండగా, శనివారం దీనికి ముగింపు కార్డ్ పడింది. ఈ ఎవిక్షన్ పాస్ సన్నీకి ఇప్పించేందుకు కాజల్ చాలా ప్రయత్నించింది. మానస్ తన నిర్ణయాన్ని చెప్పినా కూడా కాజల్ మాత్రం తన మాటలను మార్చేస్తూ వచ్చింది. మానస్ .. సిరి పేరు చెబితే కాజల్ ఆనీ మాస్టర్ పేరు చెప్పింది.
సరే అని మానస్ ఓ మెట్టు దిగి కాజల్ దారిలోకి వస్తే.. మళ్లీ యూటర్న్ తిరిగింది. చివరకు తన మనసులోని మాటను చెప్పింది. ఇద్దరివి కాలితే సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తుందనేదే తన ఆట అని కాజల్ చెప్పింది.అలా చివరకు కాజల్ పంతం నెగ్గింది. సిరి, ఆనీ మాస్టర్ ఇద్దరి బొమ్మలు కాలిపోయాయి. దీంతో ఆనీ మాస్టర్ అగ్గిలం మీద గుగ్గిలమైంది. ప్రియాంక మాట విని నేను అక్కడ ఇద్దరి బొమ్మలు కాల్చకుండా ఆగాను. లేదంటే అక్కడే సన్నీ బొమ్మా కాలిపోయేది.
కాజల్, మానస్ మాత్రం ఆస్కార్ లెవల్లో నటిస్తున్నారు. సిరికి ఇవ్వండని చెప్పినా కూడా ఇవ్వలేదు.. వారు సన్నీకి ఇవ్వాలని అనుకుంటున్నారు.. అదేదో చెప్పి ఇస్తే ఏ బాధ ఉండదు అని ఆనీ మాస్టర్ తెగ ఏడ్చేసింది.ఆనీ మాస్టర్ మాత్రం రాత్రంతా కూడా నిద్రపోకుండా బాధపడుతూ ఏడుస్తూనే ఉంది. ఎవిక్షన్ పాస్ దక్కించుకున్న సన్నీకి సరైన టైంలో పాస్ ఇస్తామని బిగ్ బాస్ చెప్పాడు.