బిగ్ బాస్ హౌజ్‌లో ముందు నుండి కలిసి గేమ్ ఆడుతూ వస్తున్న సిరి-షణ్ముఖ్‌లు చాలా క్లోజ్ అయిపోయారు. వారిని అందరు చూస్తున్నారనన్న విషయం కూడా మరచిపోయారు. ఈ క్రమంలో నాగార్జున వారికి క్లాస్ పీకాడు. ముందుగా సిరిని కన్పెషన్ రూంలోకి పిలిచి క్లాస్ పీకాడు. నీ బాధ ఏంటి? ఏమైంది? ఎందుకు అలా తలను బాదుకున్నావ్ అని నాగార్జున అడిగాడు.
నాగ్ ప్రశ్నలకు స్పందించిన సిరి.. నేను వెరీ ఎమోషనల్ పర్సన్.. ఆ ఎమోషన్ ఎందుకు వస్తోందో కూడా ఎందుకో అర్థం కావడం లేదు.. ఎదుటి వాళ్లను నేను హర్ట్ చేయను.. ఎవ్వరు నన్ను చేసినా నేనే హర్ట్ అవుతాను..ఎమోషనల్ కనెక్షన్ పెరుగుతోంది.. నా స్టోరీ నాకు తెలుసు.. బయట ఏంటో నాకు తెలుసు.. కానీ కనెక్షన్ వస్తోందో నాకు అర్థం కావడం లేదు.
ఇది తప్పా రైటా? అని కూడా తెలియడం లేదు.. బ్యాడ్ అనుకుంటారా? గుడ్ అనుకుంటారా? అని కూడా ఆలోచించడం లేదు. తప్పు అని తెలిసినా కూడా చేసేస్తున్నాు.. ఎలా రిసీవ్ చేసుకుంటారు అని కూడా ఆలోచించడం లేదు’ అని సిరి స్ట్రైట్ ఫార్వార్డ్‌గా చెప్పింది. దీనికి నాగ్.. నువ్ ఎలా ఉన్నా, ఏం చేశావ్ అని అడగడం లేదు కానీ నువ్ మాత్రం ఇంకోసారి ఇలా నీది నువ్ గాయపర్చుకోవద్దని సిరికి నాగార్జున సూచించాడు. ఇంకోసారి ఇలా గాయపర్చుకుంటే బిగ్‌బాస్ హౌస్ నుంచి పంపించేస్తానని నాగ్ వార్నింగ్ ఇచ్చాడు.