హౌజ్‌లో అనీ మాస్టర్ అరాచకం పెరుగుతూ పోతుంది. ఆమె కాజల్‌ని టార్గెట్ చేసి వెక్కిరింతలు చేస్తుంది. కాజల్‌తో ప్రవర్తించిన తీరు బాగోలేదని యానీకి చురకలు అంటించాడు నాగ్. వెక్కిరించడం కొంతవరకే బాగుంటుందని, కానీ అది హద్దులు మీరుతోందని హెచ్చరించాడు. అయితే యానీ మాత్రం తనది చైల్డిష్ బిహేవియర్ అని, ఏదున్నా ముఖం మీదే చెప్తానంటూ చివరకి అలానే చేయనని చెప్పుకొచ్చింది.
అనంతరం శ్రీరామచంద్ర, సన్నీ సేఫ్ అయినట్లు ప్రకటించాడు నాగ్. ఆ తరువాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ గురించి వివరించారు. నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి ఇది ఉపయోగపడదు. ఎలిమినేషన్ కాకుండా కాపాడుతుంది.. అది నీ కోసమైనా వాడుకోవచ్చు లేదా నీకు నచ్చిన వారి కోసమైనా వాడుకోవచ్చు అని సన్నీకి చెప్పాడు నాగ్.
ఇక టీ షర్ట్ ఎలా వేసుకోవాలో తెలుసు కదా? అంటూ కౌంటర్లు వేశాడు నాగ్. టీ షర్ట్ అయితే అలా వేసుకున్నావ్.. పాంట్ అయితే రివర్స్ వేసుకోవు కదా? అని నవ్వించాడు నాగార్జున. మొత్తానికి శనివారం నాటి ఎపిసోడ్ అలా ముగిసింది. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్లో అనీ మాస్టర్ ఎలిమినేట్ కానుందంటూ లీకులు అందుతున్నాయి. ఈ వారం రవి తప్ప అందరు నామినేషన్లో ఉన్న విషయం తెలిసిందే.