Rakshasudu 2 | ‘ రాక్షసుడు 2’ సస్పెన్స్‌కు తెర..ఆ స్టార్ హీరో ఇతడేనా..?
రమేశ్ వర్మ (Ramesh Varma) డైరెక్షన్లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన రాక్షసుడు బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పటికే రాక్షసుడు 2 పోస్టర్లు కూడా రిలీజ్ చేయగా..మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు కనిపించబోతున్నారనే విషయంలో మాత్రం మొదటి నుంచి సస్పెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం రాక్షసుడు (Rakshashudu). రమేశ్ వర్మ (Ramesh Varma) డైరెక్షన్లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ డైరెక్టర్ మరోసారి సీక్వెల్‌తో థ్రిల్‌ను అందించేందుకు రెడీ అవుతున్నాడని తెలిసిందే. ఇప్పటికే రాక్షసుడు 2 పోస్టర్లు కూడా రిలీజ్ చేయగా..మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు కనిపించబోతున్నారనే విషయంలో మాత్రం మొదటి నుంచి సస్పెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు.
తాజాగా దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..? ఇటీవలే విక్రాంత్ రోన సినిమాతో భారీ హిట్టు కొట్టిన కిచ్చా సుదీప్ (Kicha Sudeep). ఆసక్తికరంగా ఉన్న ఈ వార్తపై అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ రానుంది. మొత్తానికి సుదీప్ ఫైనల్ అయితే మాత్రం సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే చెప్పొచ్చు. రానున్న రోజుల్లో కొత్త అప్డేట్ ఏదైనా వస్తుందేమో చూడాలి మరి.
ఓ కిల్లర్ రక్తంతో నిండిన కసాయి కత్తిని చేతిలో పట్టుకుని కనిపిస్తుండగా..ఓ బాలిక భయంతో పరుగులు పెడుతున్న పోస్టర్‌ను విడుదల చేయగా..క్యూరియాసిటీ పెంచుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఏ స్టూడియోస్, హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ల పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గిబ్రాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

