Tamanna |కథలో అవన్నీ భాగమే!
స్త్రీపురుషుల బంధాన్ని తెరపై తీసుకొచ్చే క్రమంలో వారి మధ్య ఆకర్షణను పరిధుల మేరకు సహజంగా చూపించడంలో ఏమాత్రం తప్పులేదని వ్యాఖ్యానించింది అగ్ర కథానాయిక తమన్నా. ఈ భామ నటించిన ‘జీ కర్దా’ వెబ్‌సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.
స్త్రీపురుషుల బంధాన్ని తెరపై తీసుకొచ్చే క్రమంలో వారి మధ్య ఆకర్షణను పరిధుల మేరకు సహజంగా చూపించడంలో ఏమాత్రం తప్పులేదని వ్యాఖ్యానించింది అగ్ర కథానాయిక తమన్నా. ఈ భామ నటించిన ‘జీ కర్దా’ వెబ్‌సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఇందులో శృంగార సన్నివేశాలు శృతిమించాయని, తమన్నా పాత్ర హద్దు మీరి ప్రవర్తించిందనే విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తమన్నా ‘జీ కర్దా’ వెబ్‌సిరీస్ గురించి మాట్లాడింది.
కథావిష్కరణలో రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఓ భాగమని ఆమె స్పష్టం చేసింది. తమన్నా మాట్లాడుతూ ‘ప్రేమలో ఉన్న ఓ జంట ప్రయాణాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నప్పుడు వారి మధ్య ఉండే గాఢమైన బంధం గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది. ఆ సన్నివేశాలను కథలో భాగంగానే చూడాలి. ఇంటిమేట్ సీన్స్‌లో నేను ఎక్కడా హద్దు మీరలేదు. కథకు అవసరం కాబట్టే నటించా’ అని వివరణ ఇచ్చింది. ఏడుగురు చిన్ననాటి మిత్రుల లైఫ్ జర్నీ నేపథ్యంలో ‘జీ కర్దా’ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. అరుణిమా శర్మ దర్శకత్వం వహించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

