The Great Pre Wedding Show | వచ్చే నెల 7న రాబోతున్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. ట్రైలర్ రిలీజ్
The Great Pre Wedding Show | తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
The Great Pre Wedding Show | తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో మంగళవారం నాడు చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కి దర్శకులు కరుణ కుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, రామ్ అబ్బరాజు, సన్నీ, దుశ్యంత్, ఉదయ్ గుర్రాల, రూపక్, తేజ, నంద కిషోర్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో.. దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ .. ‘తిరువీర్‌ను నేను ఓ నాటకంలో చూశాను. నేను మూవీ తీస్తే తిరువీర్‌కి పాత్ర ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. ‘పలాస’లో మూడు పాత్రలు అనుకున్నప్పుడు అందులో తిరువీర్ ఉండాలని అనుకున్నాను. ‘పలాస’ కోసం మేం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. తల్లి చనిపోయినా కూడా తిరువీర్ ఆ విషయాన్ని మాకు చెప్పకుండా షూటింగ్లో సీన్ చేశాడు. అలా తిరువీర్ మాకు ఎంతో సహకరించారు. డెబ్యూగా సినిమాలు తీసేటప్పుడు మేకర్లకు ఉండే కష్టాలు మా అందరికీ తెలుసు. ఈ చిత్రం వంద శాతం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. రూటెడ్ కథల్నే ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నవంబర్ 7న ఈ చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
హీరో తిరువీర్ మాట్లాడుతూ .. ‘మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ కోసం ఇంత మంది దర్శకులు వచ్చారు. నేను ఇంత మంది మంచి ఫ్రెండ్స్‌ను దర్శకుల రూపంలో సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉంది. నిర్మాత సందీప్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. కథ చెప్పినప్పుడు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నాను. ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. ఫ్యామిలీ అంతా కలిసి టూర్‌కు వెళ్లినట్టుగా షూటింగ్ చేశాం. మంచి కంటెంట్‌తో మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ నవంబర్ 7న రాబోతోంది. మా చిత్రం అందరికీ నచ్చుతుంది. మా సినిమాను ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మాకు అండగా నిలిచిన జీ సంస్థకు థాంక్స్. ’ అని అన్నారు.
చిత్ర నిర్మాత సందీప్ అగరం మాట్లాడు తూ.. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఈవెంట్‌కు వచ్చిన దర్శకులందరికీ థాంక్స్. మా హీరో తిరువీర్ ఈ ప్రయాణంలో ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. దర్శకుడు రాహుల్ ఈ మూవీని అద్భుతంగా తీశారు. నవంబర్ 7న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో హీరో తిరువీర్. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ట్రైలర్‌కు వంద రెట్లు అనేట్టుగా సినిమా ఉంటుంది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా మా చిత్రం ఉంటుంది. నవంబర్ 7న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.
హీరోయిన్ టీనా శ్రావ్య మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇంత మంచి దర్శకులంతా కూడా మా ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్ని ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. మేం ఎంతో ఇష్టపడి, కష్టపడి ఈ మూవీని చేశాం. మా టీం అందరికీ థాంక్స్. నవంబర్ 7న థియేటర్లోకి రాబోతోంది. మంచి కంటెంట్‌తో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

