‘ఇండస్ట్రీ నుంచి ‘తిమ్మరాజుపల్లి టీవీ’కి మంచి స్పందన వస్తున్నది. జనాల్లో కూడా టాక్ పాజిటివ్‌గా ఉన్నది. సినిమా రిలీజైన ఒక్కరోజులోనే ఇందులో నటించిన ఐదారుగురు కొత్తవాళ్లకు ఆఫర్లు వచ్చాయి. ఇవన్నీ నిర్మాతగా నాకు ఆనందాన్నిస్తున్న అంశాలు. కథ వినగానే ఈ సినిమా జనానికి నచ్చుతుందనిపించింది. అనుకున్నట్టే నచ్చింది. కొత్తవారితో నేను చేసిన ఈ హానెస్ట్ అటెంప్ట్ మంచి విజయాన్ని అందుకున్నందుకు నిజంగా సంతృప్తిగా ఉంది’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. కొత్త ప్రతిభను పరిచయం చేయాలనే దృక్పథంతో తన కేఏ ప్రొడక్షన్స్ పతాకంపై సుమైనా స్టూడియోస్‌తో కలిసి కిరణ్ అబ్బవరం నిర్మించిన పీరియడ్ డ్రామా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సాయితేజ్, వేద జలంధర్ జంటగా నటించారు. వి.మునిరాజు దర్శకుడు. ఇటీవలే సినిమా విడుదలైన ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన థ్యాంక్స్ మీట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడారు. అన్ని వయసులవారినీ అలరిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అని దర్శకుడు వి.మునిరాజు అన్నారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.