23 నుంచి థియేటర్ల పునఃప్రారంభం

దాదాపు మూడు నెలల విరామం తర్వాత థియేటర్లలో బొమ్మ పడబోతున్నది. ఈ నెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్స్ పునఃప్రారంభంకాబోతున్నాయి. కరోనా సెకండ్‌వేవ్ ఉధృతితో ఏప్రిల్ నెలలో థియేటర్లు మూతపడ్డాయి. ఇటీవలే లాక్డౌన్ నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం సినిమాల ప్రదర్శనలకు అనుమతులు ఇచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా యాజమాన్యాలు, ఎగ్జిబిటర్లు థియేటర్లను తెరవడానికి ముందుకు రాలేదు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ శనివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కరోనా సెకండ్‌వేవ్ మూలంగా థియేటర్లు మూతపడటంతో అందులో పనిచేసే లక్షలాది మంది కార్మికులు జీవనోపాధిని కోల్పోయారు. వారు ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 23 నుంచి థియేటర్లను తెరవాలని ఎగ్జిబిటర్స్ నిర్ణయించారు. ఆ సమయంలోగా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను థియేటర్లలో ప్రదర్శించాలని నిశ్చయించారు. తమ సమస్యల పరిష్కారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందనే నమ్మకంతో ఉన్నామని ఎగ్జిబిటర్స్ పేర్కొన్నారు.
సమస్యల్ని పరిష్కరించాలి..
కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా నష్టపోయిన థియేటర్ల వ్యవస్థను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోరింది. శనివారం సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిసిన ఛాంబర్ ప్రతినిధులు ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించి థియేటర్లను కాపాడాలని మంత్రికి విన్నవించారు. సినీ ఎగ్జిబిటర్స్ ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఛాంబర్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఫ్రీపార్కింగ్ మూలంగా థియేటర్ల నిర్వహణ భారం పెరిగింది. పార్కింగ్ ఫీజు తిరిగి వసూలు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఛాంబర్ ప్రతినిధులు కోరారు. అలాగే లాక్డౌన్ సమయంలో థియేటర్లు మూసివేసిన కాలానికి కరెంటు బిల్లులను రద్దుచేయాలని తెలిపారు. మున్సిపల్, ప్రాపర్టీ టాక్స్‌ను రెండేళ్ల కాలానికి మినహాయింపు ఇవ్వడమే కాకుండా స్టేట్ జీఎస్స్టీని మాఫీ చేసి థియేటర్లను కాపాడాలని తెలంగాణ ఛాంబర్ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ మురళీమోహన్, సెక్రటరీ సునీల్‌నారంగ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

