హీరో రామ్ తొలిసారి పోలీస్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది వారియర్’. ఇందులో ఆయన ఐపీఎస్ అధికారి సత్య పాత్రలో కనిపించనున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో ‘దడ దడ’ అంటూ సాగే రెండో గీతాన్ని ఇటీవల అగ్ర దర్శకుడు గౌతమ్‌మీనన్ విడుదల చేశారు. ‘దడదడమని హృదయం శబ్దం..నువ్వు ఇటుగా వస్తావని అర్థం..బడబడమని వెన్నెల వర్షం..నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం..నువ్వు విసిరిన విజిల్ పిలుపు ఒక గజల్ కవితగా మారే..’ అంటూ చక్కటి కవితాత్మక భావనలు కలబోసిన ఈ గీతానికి శ్రీమణి సాహిత్యాన్నందించారు. దేవిశ్రీప్రసాద్ స్వరాల్ని సమకూర్చారు. ‘శ్రావ్యమైన మెలోడీ ఇది. హైదరాబాద్‌లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించాం. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. కృతిశెట్టి కథానాయికగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుజీత్ వాసుదేవ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్.లింగుస్వామి.