ప్రకాష్‌రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యుల రాజీనామాలను ఆమోదించామని అన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు. రాజీనామాలను వెనక్కి తీసుకోవాల్సిందిగా సభ్యులను కోరినప్పటికీ వారు అంగీకరించలేదని తెలిపారు. పదవులకు రాజీనామా చేసిన వారందరూ ‘మా’ అసోసియేషన్‌లో సభ్యులుగా కొనసాగుతారని ఆయన మంచు విష్ణు పేర్కొన్నారు. ఆదివారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్వర్యంలో సభ్యులకు ఉచిత హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మంచు విష్ణు మాట్లాడుతూ “మా’ ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసి గెలుపొందిన 11 మంది సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా వారికి నెల రోజులు గడువు ఇచ్చాం. గడువులోగా సభ్యులు రాజీనామాలను వెనక్కి తీసుకోకపోవడంతో వాటిని ఆమోదించాం. అసోసియేషన్ అభివృద్ధి కుంటు పడకూడదని వారి స్థానంలో కొత్త సభ్యులను తీసుకున్నాం. ప్రకాష్‌రాజ్, నాగబాబుతో పాటు రాజీనామా చేసిన వారందరూ అసోసియేషన్‌లో సభ్యులుగా కొనసాగుతారు. ‘మా’ బిల్డింగ్ కోసం చర్చలు జరుగుతున్నాయి. వారం రోజుల్లో భవనంపై ప్రకటన చేస్తాం. అలాగే ప్రతి ఏడాది డిసెంబర్ రెండో వారంలో హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటుచేయబోతున్నాం’ అని తెలిపారు.