రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’ షూటింగ్లో ఓవైపు బిజీగా ఉంటే.. మరోవైపు ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చేయనున్న ఆయన తదుపరి సినిమాకు సంబంధించి ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. క్రీడా నేపథ్యంతో కూడిన గ్రామీణ కథతో తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా సినిమాకోసం హైదరాబాద్ నడిబొడ్డున ఒక విలేజ్ సెట్‌ను మేకర్స్ నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్ నివాసానికి అతి చేరువలో ఈ భారీ సెట్‌ను నిర్మిస్తుండటం విశేషం.
ఈ సినిమా షూటింగ్ 75శాతం ఈ సెట్లోనే జరుగనున్నదట. ఈ సెట్ పూర్తికావడానికి కనీసం రెండు నెలలైనా పడుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. గతంలో రామ్‌చరణ్ ‘రంగస్థలం’ కోసం కూడా ఇలాగే ఓ విలేజ్ సెట్‌ని నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సెట్ అప్పట్లో చర్చనీయాంశంగా నిలవడమేకాక, సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇప్పుడు బుచ్చిబాబు కూడా గురువు దారిలోనే పయనిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాకోసం రామ్‌చరణ్ తన శరీరాకృతిని మార్చుకునే పనిలో ఉన్నారట. జాన్వీకపూర్ కథానాయికగా నటించనున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ స్వరాలందించనున్న విషయం తెలిసిందే. మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి వృద్ధి సినిమాస్ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నది.