దివ్యాంగ పోలీస్ సాహసం
వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సోనమ్ కపూర్ మూడేండ్లు తెరకు దూరంగా ఉంది.
వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సోనమ్ కపూర్ మూడేండ్లు తెరకు దూరంగా ఉంది. వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయిస్తూ వచ్చింది. 2019లో ‘ద జోయా ఫ్యాక్టర్’ అనే చిత్రంలో నటించిన సోనమ్…ఆ తర్వాత ఏ ప్రాజెక్ట్ ఎంచుకోలేదు. అందంతో పాటు ప్రతిభ గల ఈ నటి ఇండస్ట్రీకి దూరమవడం ఎవరికీ నచ్చలేదు.
ఈ విరామం తర్వాత ఆమె నటించిన ‘బ్లైండ్’ మూవీ త్వరలో ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్నది. 2011లో ఇదే పేరుతో వచ్చిన కొరియన్ మూవీ ఆధారంగా హిందీలో రీమేక్ చేశారు. సుజోయ్ ఘోష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి షోమ్ మకీజా దర్శకత్వం వహిస్తున్నారు.
దివ్యాంగురాలైన ఓ పోలీస్ ఆఫీసర్ సీరియల్ కిల్లర్‌ను ఎలా పట్టుకుంది అనేది ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలో దివ్యాంగురాలి పాత్రలో నటించేందుకు సోనమ్ కపూర్ కళ్లకు గంతలు కట్టుకుని సాధన చేసింది. నిర్మాత సుజోయ్ ఘోష్ మాట్లాడుతూ…‘మా చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలనుకున్నాం. అయితే అక్కడ పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయి. ఏ చిత్రానికి ఆదరణ దక్కుతుందో, ఏది తిరస్కరణకు గురవుతుందో తెలియకుండా ఉంది. దాంతో నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రంలో పురబ్ కొహ్లీ, వినయ్ పాఠక్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

