700కోట్ల ఓటీటీ డీల్?
హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన ‘రామాయణ’ టీజర్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా విజువల్స్ హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో ఉన్నాయని ప్రశంసలొస్తున్నాయి.
హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన ‘రామాయణ’ టీజర్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా విజువల్స్ హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో ఉన్నాయని ప్రశంసలొస్తున్నాయి. రాముడి పాత్రలో రణ్‌బీర్‌కపూర్ అద్భుతంగా ఒదిగిపోయారని నెటిజన్లు పొగడ్తలు కురిపిస్తున్నారు. నితేష్ తివారి దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
రెండు భాగాలుగా రూపొందిస్తున్న ‘రామాయణ’ చిత్రానికి దాదాపు 4000కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించారు. తాజాగా ఈ సినిమా రెండు భాగాల డిజిటల్ హక్కుల కోసం ఒక ఓటీటీ సంస్థ 700కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందని ముంబై మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే ఈ ఆఫర్‌ను నిర్మాత తిరస్కరించారట. వెయ్యికోట్ల ఓటీటీ డీల్ కోసం మేకర్స్ ప్రయత్నిస్తున్నారని, సినిమాకు పెడుతున్న బడ్జెట్ దృష్ట్యా ఆ నెంబర్ మాత్రమే ప్రాఫిటబుల్ డీల్‌గా ఉంటుందన్నది నిర్మాతల అభిప్రాయం.
‘రామాయణ’ తొలి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ సమయంలో తాము కోరుకున్న విధంగా వెయ్యికోట్ల డీల్ సెట్ అవుతుందని నిర్మాతలు ఆశాభావంతో ఉన్నారట. ఈ చిత్రంలో కన్నడ నటుడు యష్ రావణుడిగా నటిస్తుండటంతో పాటు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. దాంతో ఓటీటీ డీల్ విషయంలో నమిత్ మల్హోత్రాతో పాటు యష్ కూడా పట్టుదలతో ఉన్నారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

