వీజే సన్నీ, ఆషిమా జంటగా దర్శకుడు శ్రీనివాస్ వెలిగొండ రూపొందిస్తున్న సినిమా ‘సకలగుణాభిరామా’. సంజీవ్ రెడ్డి నిర్మాత. ఈ నెల 16న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ వెలిగొండ మాట్లాడుతూ…‘చిన్న చిత్రాల విడుదలకు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి.
పెద్ద సినిమాల మధ్య థియేటర్స్ దొరకడం లేదు. మా సినిమాకు మంచి తేదీ కుదిరి, థియేటర్స్ లభించాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది’ అన్నారు. ‘నేను ‘బిగ్‌బాస్’ ప్రోగ్రాంలో పాల్గొనకముందే వచ్చిన అవకాశమిది. మంచి కథా కథనాలు కుదిరాయి. తప్పకుండా మీకు నచ్చే సినిమా అవుతుంది’ అని హీరో వీజే సన్నీ అన్నారు. శ్రీతేజ్, తరుణీ సింగ్, జెమినీ సురేష్, సరయూ, చమ్మక్ చంద్ర ఇతర పాత్రధారులు.