బిపిన్, రమ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘బంగారు తెలంగాణ’. స్వీయ దర్శకనిర్మాణంలో బిపిన్ తెరకెక్కించారు. సెన్సార్ పూర్తయింది. ‘యు’ సర్టిఫికెట్ లభించింది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శక నిర్మాత బిపిన్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి, అన్ని రంగాల్లో సాధించిన విజయాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించాం. తెలంగాణ అమరవీరులకు ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నాం. డిసెంబర్లో విడుదల చేయబోతున్నాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మధు ఏ నాయుడు, కథ, మాటలు, పాటలు, సంగీతం, స్క్రీన్ప్లే, నిర్మాత, దర్శకత్వం: బిపిన్.