నువ్వు పుట్టిందే గెలిచేందుకు..
‘బతకాలంటే గెలవాల్సిందే..ఎగరాలంటే రగలాల్సిందే’ అంటున్నారు విజయ్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం విజయ్ దేవరకొండ పుట్టినరోజును పురస్కరించుకొని ‘లైగర్’ హంట్ థీమ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌ను సాధన చేస్తూ శక్తివంతంగా కనిపించారు విజయ్ దేవరకొండ. యాక్షన్ ఘట్టాలు రోమాంచితంగా అనిపించాయి. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఆరు పలకల దేహంతో బాక్సింగ్ రింగ్‌లో పోరుకు సై అంటున్నారు విజయ్ దేవరకొండ. ‘బతకాలంటే గెలవాల్సిందే..ఎగరాలంటే రగలాల్సిందే..నువ్వు పుట్టిందే గెలిచేటందుకు..దునియా చమడాల్ వలిచేటందుకు..అది గుర్తుంటే ఇంకేం చూడకు..ఎవడు మిగలడు ఎదురుపడేందుకు..’ అంటూ సాగిన హంట్ థీమ్‌ను భాస్కరభట్ల రచించారు. హేమచంద్ర ఆలపించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని జరుపుకొంటున్నది. ఈ చిత్రానికి కెమెరా: విష్ణుశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మికౌర్, కరణ్‌జోహార్, అపూర్వమెహతా, నిర్మాణ సంస్థలు: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

