The Kashmir Files | ఓటీటీలోకి ‘ది కాశ్మీర్ ఫైల్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొన్ని సినిమాలు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంటాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంటాయి. అదే కొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతుంటాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామీని సృష్టిస్తాయి.
The Kashmir Files on OTT | కొన్ని సినిమాలు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంటాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంటాయి. అదే కొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతుంటాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామీని సృష్టిస్తాయి. ఇందులో తేడా బడ్జెట్లో కాదు.. కంటెంట్‌లో. కంటెంట్ ఉంటే పేరున్న కథానాయకులు కూడా అవసరం లేదు అని ఇప్పటికే పలు సినిమాలు నిరూపించాయి కూడా. ఈ క్రమంలో తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరిన చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం మెదటి రోజు 3.55 కోట్లు కలెక్ట్ చేస్తే 6వ రోజు ఏకంగా ఐదురేట్లు అధికంగా అంటే 19కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రం 87.40 కోట్ల కలెక్షన్లను సాధించి 100కోట్ల క్లబ్‌కు దగ్గరలో ఉంది.
మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్‌కుమార్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రీ దర్శకత్వం వహించాడు. కాశ్మీర్ పండిట్లపై జరిగిన సామూహిక హత్యకాండ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా ఈ చిత్ర ఓటీటీ విడుదల తేది ప్రకటన వచ్చింది. ఈ చిత్రం మే 6 నుంచి జీ-5లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటి వరకు ఎంత పెద్ద సినిమా అయినా నాలుగు వారాలలోపే ఓటీటీలోకి వచ్చింది. కానీ ఈ చిత్రం మాత్రం విడుదలైన 56రోజులకు డిజిటల్లోకి రానుంది. ఇక ఈ చిత్రంతో ‘రాధేశ్యామ్’ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పోటీ ఎదురైంది. ఇప్పటికే పలు థియేటర్లలో ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని తొలగించి ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

