రాధే శ్యామ్ సినిమాకు నిజంగా ఇది కలలో కూడా ఊహించని దెబ్బ..!
The Kashmir Files | కాలం కలిసిరాకపోతే తాడే పామై కాటేస్తుందంటారు. ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. విడుదలకు ముందు వరకు కూడా ఈ సినిమా గురించి ఇండియా అంతా మాట్లాడుకుంది. విడుదల తర్వాత పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా కలెక్షన్స్ వర్షం కురుస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు అలా జరగడం లేదు. అసలు పోటీనే కాదనుకున్న ఓ చిన్న సినిమా సంచలన వసూళ్లు సాధించడమే కాకుండా.. ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాకు పోటీ ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా దెబ్బకు రాధే శ్యామ్ బాక్సాఫీస్ దగ్గర తగ్గాల్సిన అవసరం వచ్చేసింది. అదే ది కాశ్మీర్ ఫైల్స్.
వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం అనూహ్యమైన వసూళ్లు సాధిస్తుంది. మొదటి రోజుతో పోలిస్తే మూడో రోజు ఐదు రెట్లు అదనంగా కలెక్షన్స్ వచ్చాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియన్ లవ్ స్టోరీ రాధే శ్యామ్ సినిమాను సైతం ఇది పడగొట్టింది. మరోవైపు కాశ్మీర్ ఫైల్స్ సినిమా అద్భుతమైన కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. కాశ్మీర్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. ఇండియాలో మొదటి సారి ఓ కథను ఇంత బోల్డ్‌గా చూపించారనే ప్రశంసలు వస్తున్నాయి. మొదటి రోజు కేవలం 4 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. మూడో రోజు 15 కోట్లు వసూలు చేసింది.
మరోవైపు రాధే శ్యామ్ సినిమా మూడు రోజుల్లోనే రూ.151 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటూ దర్శక నిర్మాతలు పోస్టర్ విడుదల చేశారు. కానీ కచ్చితంగా కాశ్మీర్ ఫైల్స్ దెబ్బకు అటు హిందీ.. ఇటు తెలుగు రెండు చోట్లా రాధే శ్యామ్ సినిమాకు ఊహించని దెబ్బ అయితే పడుతుంది. మరోవైపు పాజిటివ్ మౌత్ టాక్‌తో కాశ్మీర్ ఫైల్స్ చూడ్డానికి థియేటర్లకు ప్రేక్షకులు కదులుతున్నారు. భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల ఈ సినిమాకు అనూహ్యమైన కలెక్షన్స్ వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ చిత్రం మరింత సంచలన వసూళ్లు సాధించేలా కనిపిస్తుంది. వీక్ డేస్ మొదలైన తర్వాత హౌజ్‌ఫుల్ కలెక్షన్స్‌తో సునామి సృష్టించేలా కనిపిస్తుంది ఈ చిత్రం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

