ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ (ఐఫా) వేడుకలు అబుదాబీలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయనకు పెండ్లి గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ‘నన్ను పెండ్లి చేసుకుంటారా’ ? అని ఓ మహిళా అభిమాని ప్రశ్నించగా..‘నాకు పెండ్లి చేసుకునే వయసు దాటి పోయింది.
మీరు ఈ ప్రశ్న నన్ను ఇరవై ఏండ్ల కిందట అడగాల్సింది’ అని బదులిచ్చారు సల్మాన్. ఈ ప్రశ్నోత్తరాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. సల్మాన్ పెండ్లి గురించి గత పాతికేండ్లుగా బాలీవుడ్ మీడియాలో ఎన్నో రకాల కథనాలు వెలువడ్డాయి. తన పెండ్లి గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి సల్మాన్ తనదైన శైలిలో స్పందిస్తూ తప్పించుకుంటున్నారు.