ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘లస్ట్‌స్టోరీస్-2’ వెబ్‌సిరీస్‌లో కథానాయిక మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో నటించింది. ఆధునిక సమాజంలో స్త్రీపురుష సంబంధాలు, మారుతున్న ఆలోచనా ధోరణులను చర్చిస్తూ ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇందులో శృంగార సంబంధ అంశాల చర్చ ఎక్కువగా ఉందనే విమర్శలొస్తున్నాయి. తాజాగా వీటిపై మృణాల్ ఠాకూర్ స్పందించింది. యుక్త వయసులో శృంగారం గురించి పరిణితితో కూడిన చర్చ అవసరమని ఆమె పేర్కొంది.
ఎలాంటి బేషజాలు లేకుండా పెద్దల దగ్గర ఆ విషయాలను చర్చిస్తే మానవ సంబంధాలపై మరింత స్పష్టమైన అవగాహన కలుగుతుందని చెప్పింది. ‘ఎదిగే వయసులో మనసులోని భావాల గురించి నిజాయితీగా ఇంటి పెద్దల దగ్గర చర్చించాలి. అప్పుడే మంచి చెడుల భేదాలు తెలుసుకుంటాం. భవిష్యత్తులో అనవసరమైన ఉద్రేకాలకు లోనుకాకుండా మెచ్యూర్డ్‌గా ఆలోచించే వ్యక్తిత్వం అలవడుతుంది’ అని మృణాల్ ఠాకూర్ చెప్పింది.