The Heart Of Irumudi | మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ని చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ గ్లింప్స్ చూస్తుంటే.. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే బలమైన ఎమోషనల్ బాండింగ్ చుట్టూ కథ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. తాగుడికి బానిసైన తండ్రి ఆ వ్యసనానికి దూరమవ్వడం కోసం అయ్యప్ప మాలా వేసిన అనంతరం జరిగిన సంఘటనలు ఏంటి అనేది ఈ సినిమా కథ.
అయ్యప్ప స్వామి భక్తి, అయ్యప్ప మాల నేపథ్యంతో పాటు హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఆధ్యాత్మికత, ఫ్యామిలీ ఎమోషన్స్ సమానంగా ఉండేలా రవితేజను ఒక సరికొత్స రిఫ్రెషింగ్ అవతార్‌లో చూపించబోతున్నాడు శివ నిర్వాణ. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, రవితేజ కుమార్తెగా బేబీ నక్షత్ర, ఇతర కీలక పాత్రల్లో సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, స్వాసిక నటిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జులై లేదా ఆగస్టు 2026లో భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.