Tiger 3 | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) టైగర్ ప్రాంఛైజీలో నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేశాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే జోనర్లో వస్తున్న తాజా చిత్రం టైగర్ 3 (Tiger 3). మనీశ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 16న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో పది రోజుల్లో టైగర్ వస్తున్నాడంటూ మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్లో గన్ పట్టుకుని యాక్షన్ మోడ్‌లో సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఇరవై ఏళ్ల జీవితాన్ని భారతదేశం కోసం అర్పించిన ఓ స్పై ఏజెంట్‌ను దేశ ద్రోహి అంటూ ముద్ర వేస్తే.. తనపై పడిన ముద్రను చెరిపేసుకోవడానికి టైగర్ ఏం చేశాడు అనేది ఈ సినిమా స్టోరీ.
The countdown begins! 10 days to go for #Tiger3Trailer – Out on 16th October. #Tiger3 arriving in cinemas this Diwali. Releasing in Hindi, Tamil & Telugu. #10DaysToTiger3Trailer | #YRF50 | #YRFSpyUniverse pic.twitter.com/2XvNm0c8mk
— Yash Raj Films (@yrf) October 6, 2023
యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ కాబోతుంది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్, టైగర్ జిందా హే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించాయి.