ఈ ఏడాది ప్రదానం చేయనున్న 70వ జాతీయ చలన చిత్ర అవార్డులకు సంబంధించిన రెండు క్యాటగిరీల పేర్లు మార్చుతూ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇందిరాగాంధీ పేరు మీద ఇచ్చే ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి అవార్డుతో పాటు, నర్గీస్‌దత్ జాతీయ సమైక్యతా అవార్డుల పేర్లను మార్చుతున్నట్లు నేషనల్ అవార్డ్స్ కమిటీ పేర్కొంది.
ఈ రెండు అవార్డుల్లో ఇందిరాగాంధీ, నర్గీస్‌దత్ పేర్లను తొలగించారు. నర్గీస్‌దత్ ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం అవార్డు ఇకపై…‘జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను పెంపొందించేందుకు కృషి చేసిన ఉత్తమ చిత్రం’ పేరుతో ప్రదానం చేయబడుతుంది. ఇందిరాగాంధీ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి అవార్డు పేరును ‘బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్’గా మార్చారు. ఇందిరాగాంధీ పేరు మీద అవార్డును 1984లో, నర్గీస్‌దత్ జాతీయ సమైక్యతా చిత్రం అవార్డును 1965లో ప్రవేశపెట్టారు. తాజాగా ఈ అవార్డుల పేర్లను మార్చుతూ జాతీయ అవార్డుల కమిటీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.