ఆ ట్రెండ్ పాటకు మేలు చేస్తుంది!

“బంగార్రాజు’ గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ కాబట్టి పాశ్చాత్య పరికరాలను ఎక్కువగా వాడలేదు. స్వరాలన్నీ పల్లెటూరి అనుభూతినిపంచుతాయి. నేపథ్య సంగీతం ఆహ్లాదభరితంగా ఉంటుంది’ అన్నారు సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్. ఆయన సంగీతాన్నందించిన ‘బంగార్రాజు’ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకులముందుకురానుంది. నాగార్జున, నాగచైతన్య కథానాయకులుగా నటించిన ఈ చిత్రానికి కల్యాణకృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా అనూప్‌రూబెన్స్ శుక్రవారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి…
కథకే పెద్దపీట వేస్తా
ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ‘లడ్డుండా..’అనే పాట ప్రేక్షకులకు బాగా చేరువైంది. దీనిని నాగార్జునగారు ఆలపించడం ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఒక్కో పాటను విడుదల చేసే ట్రెండ్ వల్ల చాలా మేలు జరుగుతున్నది. పాటను సునిశితంగా పరిశీలిస్తూ అందులోని ఫీల్‌ను ఒడిసిపట్టుకునే అవకాశం దొరుకుతున్నది. పాటల విడుదల మధ్య విరామం ఉండటంతో సోషల్‌మీడియాలో వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. సినిమాల విషయంలో నేను కథకే పెద్దపీట వేస్తా. ప్రయాణం చేసే సమయంలో వచ్చిన ఆలోచనల నుంచి బాణీలను సిద్ధం చేస్తుంటా.
అందుకే కాంబినేషన్స్‌కు క్రేజ్
నాగార్జునగారు టెక్నీషియన్లందరికి పూర్తి స్వేచ్ఛనిస్తారు. అందుకే కోరుకున్న అవుట్‌పుట్ అందించే వీలుంటుంది. మా కాంబినేషన్లో మంచి మ్యూజిక్ రావడానికి అదే కారణం. సంగీత దర్శకులు ప్రతి సినిమాకు ఒకేలా కష్టపడతారు. కానీ దర్శకులు, హీరోలతో ఉండే స్నేహసంబంధాల వల్ల కొన్ని సంస్థల్ని సొంతంగా ఫీలవుతాం. వాళ్లు ఏం కోరుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. అందుకే చిత్రసీమలో కాంబినేషన్స్‌కు అంత క్రేజ్ ఉంటుంది.
నాగార్జునగారితో గతంలో చేసిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం పెద్ద విజయం సాధించింది. దాంతో ఈ సినిమా విషయంలో మరింత బాధ్యత పెరిగింది. సాధారణంగా సీక్వెల్‌కు మ్యూజిక్ చేయడం కాస్త కష్టమే. ఎందుకంటే తొలిభాగంతో పోల్చిచూస్తారు. ప్రేక్షకుల అంచనాల్ని అందుకోవాలంటే చాలా ఆలోచించుకొని పనిచేయాల్సి ఉంటుంది. ‘మనిద్దరి కాంబినేషన్‌కు ఓ బెంచ్‌మార్క్ ఉంది. దానిని రీచ్ అవ్వాలి’ అని నాగార్జునగారు ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయన మాటలు నాలో స్ఫూర్తినింపాయి.
సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ
ఈ సినిమాలోని కొన్ని సంభాషణలు హృదయానికి హత్తుకుంటాయి. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా వచ్చి ఐదేళ్లవుతున్నది. దర్శకుడు కల్యాణ్‌కృష్ణ ఆలోచనల్లో చాలా పరిణతి వచ్చింది. ఇంత పెద్ద సినిమాను చాలా తక్కువ సమయంలో పూర్తిచేశాడు. ఈ సినిమా అంతా కలర్ఫుల్గా ఉంటుంది. సంక్రాంతి సీజన్లో పర్ఫెక్ట్ మూవీగా అందరిని మెప్పిస్తుంది. ప్రస్తుతం ‘శేఖర్’ సినిమాకు పనిచేస్తున్నా. బ్యాక్గ్రౌండ్స్కోర్ ప్రధానంగా మెప్పిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

