S.S.Thaman | ఈ మధ్య కాలంలో ఒక్క మోషన్ పోస్టర్‌తో సినిమాపై తిరుగులేని హైప్ వచ్చిందంటే అది బ్రో సినిమాకే. థమన్ వీర లెవల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు పవన్ ఫ్యాన్స్ ఊగిపోయారు. టైటిల్ పోస్టర్‌కే ఈ రేంజ్లో మ్యూజిక్ ఇచ్చాడంటే.. సినిమాకింక గూస్బంప్స్ స్టఫ్ గ్యారెంటీ అని పవన్ అభిమానులు అంటున్నారు. థమన్ పాటలు ఎలా ఉన్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయే రేంజ్లో ఉంటుందన్నది వాస్తవం. వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాల్లో పవర్ స్టార్‌కు ఇచ్చిన మాస్ ఎలివేషన్‌ను అభిమానులు ఇప్పట్లో మర్చిపోలేరు. ఇక బ్రో సినిమాకు కూడా అదే రేంజ్లో మ్యూజిక్‌ను ప్లాన్ చేస్తున్నాడు థమన్.
తాజాగా థమన్ బ్రో సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పనులలో బిజీ అయినట్లు వెల్లడించాడు. ఈ మేరకు పలువురు వయోలిన్ విధ్వాంసులు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వాయిస్తున్నట్లు ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ఫస్ట్ సింగిల్ మై డియర్ మార్కాండేయతో సో సో మార్కులు వేసుకున్న థమన్.. సెకండ్ సింగిల్‌ను మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ట్యూన్ కంపోజ్ చేసినట్లు ఇన్సైడ్ టాక్. సాయిధరమ్, కేతిక శర్మల మధ్య సాగే రొమాంటిక్ సెకండ్ సింగిల్‌ను శనివారం సాయంత్రం 3గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.
మరో రెండు వారాల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో పవన్‌తో పాటు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ వీర లెవల్లో రెస్పాన్స్ తెచ్చుకుంది. తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఒరిజనల్ వెర్షన్‌ను తెరకెక్కించిన సముద్రఖని.. రీమేక్ వెర్షన్‌ను కూడా తెరకెక్కించాడు. త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేశాడు. పీపుల్ మీడియా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
#BROBGM !! 🫶 pic.twitter.com/v2gL1FtUoi
— thaman S (@MusicThaman) July 14, 2023