Thalaivar 171 | ‘తలైవా 171’ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్
Thalaivar 171 | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) జైలర్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూపోతున్నాడు. ఇప్పటికే రజినీ వెట్టయ్యాన్ సినిమా చేస్తుండగా.. ఈ చిత్రానికి జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 70 %కి పైగా ఈ సినిమా కంప్లీట్ కూడా చేసుకుంది.
Thalaivar 171 | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) జైలర్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూపోతున్నాడు. ఇప్పటికే రజినీ ‘వెట్టయ్యాన్’ సినిమా చేస్తుండగా.. ఈ చిత్రానికి జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 70 %కి పైగా ఈ సినిమా కంప్లీట్ కూడా చేసుకుంది. ఇక ఈ చిత్రం అనంతరం రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ (lokesh kanagaraj)తో తలైవా 171 (Thalaivar 171) ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఇక ఖైదీ, విక్రమ్, లియో లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన లోకేశ్ కనగరాజ్ – రజినీకాంత్ కాంబోలో సినిమా రాబోతుండడంతో ఎలా ఉండబోతుందోనని అంతా ఎక్జయిటింగ్‌గా చర్చించుకుంటున్నారు. ఇదిలావుంటే ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఒక ఇంటర్వ్యులో పాల్గోన్న లోకేష్.. తలైవా 171 గురించి మాట్లాడుతూ.. రజనీకాంత్‌తో కలసి వర్క్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. తలైవా 171 నాకెంతో ప్రత్యేకమైనది. షూటింగ్ మొదలుపెట్టడానికి, ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఏడాదిన్నరలో ఈ సినిమా పూర్తి చేసి ఆ తర్వాత ‘ఖైదీ 2’ మొదలుపెడతాను అంటూ లోకేష్ వెల్లడించాడు. ఈ చిత్రాన్ని లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
Also read
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

