టీఎఫ్‌సీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘టీఎఫ్‌సీసీ సంస్థ సొంత భవనం కోసం ఫిల్మ్‌నగర్‌లో స్థలం ఇప్పించాలని, అలాగే చిత్రపురి కాలనీలో మా సభ్యులకు ఇల్లు మంజూరు చేయించాలని మంత్రిగారిని కోరుతున్నా. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదు.
ఈ విషయంలో కూడా మంత్రిగారు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అన్నారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ‘టీఎఫ్‌సీసీకి ఆరోసారి ఛైర్మన్‌గా ఎన్నికైనా ప్రతాని రామకృష్ణగౌడ్‌ను అభినందిస్తున్నా. తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. చిత్రపురి కాలనీలో కొత్తగా కట్టబోయే ఫ్లాట్స్‌లో తెలంగాణవారికి ఇళ్లు ఇప్పిస్తాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ప్రసాద్తోపాటు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

