ఒకప్పుడు తెలుగు అమ్మాయిలకి సినిమా ఆఫర్స్ రావడం చాలా కష్టంగా ఉండేది.కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. తెలుగమ్మాయిలు కూడా మంచి నటతో పాటు అందాలు ఆరబోస్తూ ఆఫర్స్ అందుకున్నారు.నార్త్ భామలకు తామేమి తక్కువ కాదని నిరూపిస్తున్నారు. పెళ్లిచూపులు తర్వాత ఫేడవుటైన రీతూవర్మకి ఇప్పుడు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇప్పుడు ఆమె ఖాతాలో టక్ జగదీష్,వరుడు కావలెను కాక మరో రెండు సినిమాలు ఉన్నాయి.
ఇక మేఘ ఆకాశ్ కూడా తెలుగుమ్మాయే అనే సంగతి తెలిసిందే. పుట్టింది చెన్నైలో అయినా ఆమె జెనెటికల్ రూట్స్ మాత్రం తెలుగే. రీసెంట్గా ఈ అమ్మడు డియర్ మేఘతో పలకరించింది. పలు సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇక తిమ్మరుసు, ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాల్లో మెరిసిన మరో తెలుగందం ప్రియాంకా జవాల్కర్. అనంతపురంకి చెందిన ప్రియాంక కలవరమాయే సినిమాతో తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు చాలా బిజీగా ఉంది.
ఇక కేటుగాడుతో పరిచయమైన విశాఖపట్నం అమ్మాయి చాందినీ చౌదరి… రీసెంట్గా కలర్ఫోటో, సూపర్ఓవర్ సినిమాలతో ప్రేక్షకులని పలకరించిన చాందిని….అడపాదడపా ఆఫర్స్ దక్కించుకుంటూనే ఉంది. పెద్ద ఆఫర్స్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. ఈ తెలుగందాలకు మంచి హిట్ దొరికితే రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.