Tollywood | వరద బాధితులకు టాలీవుడ్ చేయూత.. ఎవరు ఎంత విరాళం ఇచ్చారంటే..
Tollywood | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉభయ తెలుగు రాష్ర్టాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది.
Tollywood | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉభయ తెలుగు రాష్ర్టాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడంతో పాటు వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సహాయనిధికి తమవంతుగా సహాయం అందిస్తున్నారు.
అగ్ర హీరో బాలకృష్ణ వరద బాధితుల సహాయార్థం తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణ, ఏపీకి 50లక్షల చొప్పున కోటి రూపాయలను అందజేయనున్నట్లు మహేష్‌బాబు ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ సైతం రెండు రాష్ర్టాలకు చెరో 50 లక్షలు ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీ కలిసి రెండు రాష్ర్టాలకు 25 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ తెలంగాణ, ఏపీకి 15 లక్షల చొప్పున మొత్తం 30లక్షల విరాళాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
రెండు రాష్ర్టాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఐదు లక్షల చొప్పున మొత్తం పది లక్షల విరాళాన్ని అందిస్తున్నట్లు హీరో విశ్వక్సేన్ సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. యువ దర్శకుడు వెంకీ అట్లూరి సైతం రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 5 లక్షలు విరాళాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. కథానాయిక అనన్య నాగళ్ల రెండు రాష్ర్టాలకు కలిపి ఐదు లక్షల విరాళాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

