ఉద్వేగభరితమైన యథార్థ ప్రదర్శన
అంతర్జాతీయంగా ఆదరణ పొందిన గ్లోబల్ గేమ్ ఫ్రాంచైజ్ ‘ది ట్రైటర్స్'. ఈ రియాలిటీ షోని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ తెలుగులోకి తీసుకొస్తున్నది. ఇన్నాళ్లూ వెండితెరపై సూపర్ హీరోగా సత్తా చాటిన తేజ సజ్జా ఈ రియాలిటీ గేమ్ షో కోసం వ్యాఖ్యాతగా మారారు.
అంతర్జాతీయంగా ఆదరణ పొందిన గ్లోబల్ గేమ్ ఫ్రాంచైజ్ ‘ది ట్రైటర్స్’. ఈ రియాలిటీ షోని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ తెలుగులోకి తీసుకొస్తున్నది. ఇన్నాళ్లూ వెండితెరపై సూపర్ హీరోగా సత్తా చాటిన తేజ సజ్జా ఈ రియాలిటీ గేమ్ షో కోసం వ్యాఖ్యాతగా మారారు. 20 మంది విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొనే అత్యంత ఉద్వేగభరితమైన ఈ గేమ్ షో నాలుగు వారాలపాటు పది ఎపిసోడ్స్‌గా ప్రసారం కానున్నదని, అక్టోబర్ 15 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ మొదలవుతుందని మేకర్స్ తెలిపారు.
ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్స్, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తో విడుదల కానున్నాయని వారు ప్రకటనలో పేర్కొన్నారు. హిందీలో ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లకు అద్భుతమైన స్పందన వచ్చిందని, తెలుగులో తేజ సజ్జ తనదైన స్పాంటేనియిటీ, ఎనర్జీతో ఈ షోకు ప్రత్యేకమైన గుర్తింపు తెస్తారనే నమ్మకంతో ఉన్నామని మేకర్స్ ఆశాభావం వెలిబుచ్చారు. నమ్మకం, మోసం, ద్రోహం, ఎత్తులు, పైఎత్తుల నేపథ్యంలో ‘ది ట్రైటర్స్’ గేమ్ షో సాగుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

