తమిళనాట లాక్డౌన్.. రామ్‌చరణ్ రంగస్థలం విడుదల వాయిదా

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఏప్రిల్ 26 నుంచి తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు, ఆడటోరియమ్లు మూసివేయాలని సూచించింది. దీంతో కోలీవుడ్ దర్శక నిర్మాతలకు మరోసారి షాక్ తప్పలేదు. ఇప్పటికే రిలీజ్‌కు ప్లాన్ చేసుకున్న సినిమాలన్నీ వాయిదా పడిపోయాయి. ఈ క్రమంలో తమిళనాట భారీ రిలీజ్‌కు రెడీ అయిన రామ్ చరణ్ రంగస్థలం సినిమా కూడా వాయిదాపడక తప్పలేదు.
ఇప్పటికే తమిళనాడులో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. మొన్న విడుదలైన ధనుష్ కర్ణణ్ సినిమా కూడా కేవలం సగం ఆక్యుపెన్సీతోనే విడుదలైంది. అయినా కూడా మంచి వసూళ్లే రాబట్టింది. దీంతో పలు సినిమాలు 50 శాతం ఆక్యుపెన్సీతోనే రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే రామ్ చరణ్ రంగస్థలం తమిళ వర్షన్‌ను ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. తమిళంలో రామ్ చరణ్ కు మంచి గుర్తింపు ఉంది. అక్కడ ఆయన నటించిన కొన్ని సినిమాలకు మంచి కలెక్షన్స్ రావడంతో రంగస్థలం సినిమాను కూడా భారీగానే విడుదల చేయాలని ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ ఇప్పుడు లాక్డౌన్ విధించడంతో రంగస్థలం తమిళ వర్షన్ విడుదల వాయిదా పడింది. రంగస్థలం విడుదలకు ఇప్పుడు బ్రేకులు పడినా తర్వాత భారీగానే విడుదలకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
ఇవికూడా చదవండి..
పీపీఈ కిట్‌లో కూరగాయలు కొనడానికి వెళ్లిన హీరోయిన్.. వీడియో
కరోనా టైంలోను ఖాళీ లేకుండా ఫుల్ బిజీ అయిన నాని..!
ఒక్కో పాటకు సిద్ శ్రీరామ్ రెమ్యునరేషన్ తెలిస్తే ఖంగు తింటారు..!
చీరకట్టుతో మాయ చేస్తున్న యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు
మహేష్ ఖాతాలో మరో రికార్డ్.. మైండ్ బ్లాక్ చేసిన సూపర్ స్టార్
కోవిడ్ సమయంలోను షూటింగ్.. ఇటలీలో బిజీగా ఉన్న అక్కినేని హీరో
శ్రీరామనవమి రోజు ఆదిపురుష్ లుక్ ఎందుకు రిలీజ్ కాలేదు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

